Thursday, December 19, 2024

బిఆర్‌ఎస్‌పై బిజెపి గోబెల్స్ ప్రచారం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: బిఆర్‌ఎస్‌పై బిజెపి గోబెల్స్ ప్రచారం చేస్తోందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు మండిపడ్డారు. గతంలోనూ దుబ్బాక నుంచి నకిలీ వీడియోలు చేసి వదిలారని, బిజెపి అబద్ధాలు విని, వీడియోలు చూసి ప్రజలు మోసపోవద్దని సూచించారు. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలప్పుడు రఘునందన్ రావు అబద్దాలు చెప్పి గెలిచారని దుయ్యబట్టారు. రఘునందన్ రావు తప్పుడు మాటలు మానుకోవాలని చురకలంటించారు.  మెదక్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. సిద్దిపేటలోని కోమటి చెరువు సమీపంలో ఉన్న పార్క్ వాకింగ్ వచ్చిన వారితో హరీష్ ముచ్చటించారు. వాకింగ్ అనేది ఆరోగ్యకరమైన అలవాటు అని, వాకింగ్ తో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని ఆయన వివరించారు. ప్రజలకు సేవ చేసేందుకు వెంకట్రామిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News