Thursday, January 23, 2025

ఆరేళ్లలో బిజెపికి రూ.10,122 కోట్ల విరాళాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: దేశంలోని పలు జాతీయ పార్టీల కంటే గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో బిజెపికి మూడు రెట్లు అధికంగా విరాళాలు వచ్చాయి. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ నివేదిక వెల్లడించింది. బిజెపికి 2016- 17 నుంచి 2021-22 మధ్య రూ. 10,122. 03 కోట్ల విరాళాలు ప్రకటించగా, కాంగ్రెస్ (రూ. 1,547.43 కోట్లు), తృణమూల్ కాంగ్రెస్ (రూ. 823.30 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బి జెపికి వచ్చిన విరాళాల్లో దాదాపు 32 శాతం కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చాయి. రాజకీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాలలో సగానికి పైగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చినవే.

దేశంలోని ఏడు జాతీయ పార్టీలు మరియు 24 ప్రాంతీయ పార్టీల ద్వారా సుమారు రూ. 16,437 కోట్ల విలువైన వి రాళాలు అందాయి. ఇందులో రూ.9,188.35 కోట్లు దాదాపు 56 శాతం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా స్వీకరించబడ్డాయి. రూ.4,614.53 కోట్ల విలువైన విరాళాలు, మొత్తంలో 28 శాతం, కార్పొరేట్ రంగం నుంచి స్వీకరించబడ్డాయి. రూ 2,634.74 కో ట్లు(16.03 శాతం) ఇతర వనరుల నుంచి స్వీకరించారు. 80 శాతానికిపైగా వి రాళాలు, దాదాపు రూ. 13,190.68 కోట్లు జాతీ య పార్టీలు అందుకోగా, రూ. 3,246.95 కోట్లు (19.75శాతం) ప్రాంతీయ పార్టీలు అందుకున్నాయని నివేదికలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News