Wednesday, January 22, 2025

గిరిజనులను మోడీ అడవిమనుష్యులు చేశాడు

- Advertisement -
- Advertisement -

 

బుల్ధానా : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గిరిజనులకు పలు రకాలుగా ద్రోహం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. యుపిఎ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి వారి భవిష్యత్తుకు తీసుకువచ్చిన పలు చట్టాలను, తీసుకున్న పలు చర్యలను మోడీ నాయకత్వపు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని, ఇది ఆదివాసీల భవిష్యత్తుకు గండికొట్టే తిరోగమన చర్యనే అవుతుందని రాహుల్ చెప్పారు. మహారాష్ట్రలోని బుల్థానా జిల్లాలోని జల్గావ్ జమోద్‌లో ఆదివాసీ మహిళా కార్యకర్తల సమ్మేళనం ఉద్ధేశించి రాహుల్ ప్రసంగించారు. గిరిజనుల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వానికి పట్టింపు లేదని, ఇది చాలా తీవ్ర విషయం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టం, భూ హక్కులు , పంచాయతీరాజ్ చట్టం, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్ల వంటి వాటిలో అంతా కుడిఎడమల దగా వ్యవహారం సాగుతోందని విమర్శించారు. ప్రధాని మోడీ గిరిజనులను పలు రకాలుగా పిలుస్తారని వారిని వనవాసీలు అంటాడు.

ఆదివాసీలు వనవాసిల పదానికి చాలా తేడా ఉందని రాహుల్ తెలిపారు. వనవాసిలని వారిని సంబోధించడం ద్వారా ప్రధాని మోడీ గిరిజనులను వారు ఎప్పుడూ అడవి మనుష్యులుగా ఉండాలని నిర్ధేశిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. వారిని అటవీప్రాంతానికి పరిమితం చేయడం, వారు నగరాల ప్రవేశానికి నిషిద్ధం, వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు రాకూడదు, వారు జీవితకాలంలో విమానాలు ఎక్కే పరిస్థితి రాకూడదనేదే బిజెపి నేతల పెద్ద ఆలోచన అని రాహుల్ స్పందించారు. ఆదివాసీలు అంటే ఈ దేశానికి ఆది వ్యక్తులు వారిదే ఈ దేశం, ఈ దేశానికి వారే యజమానులు అని తనకు తన నానమ్మ ఇందిరా గాంధీ తరచూ చెపుతూ ఉండేదని రాహుల్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గిరిజనుల చరిత్రను, వారి సంస్కృతిని తెలుసుకోలేకపోతే ఇక ఈ దేశం గురించి ఏం చెపుతారు? ఏం పాలిస్తారని బిజెపికి రాహుల్ చురకలు పెట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News