Wednesday, January 22, 2025

ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తక్కువ కాలంలోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అ ధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో కూడా బిజెపి జెండా ఎగిరిందని వ్యాఖ్యానించారు. గతంలో రే వంత్ ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరిలో కూడా బిజెపి సత్తా చాటిందని పేర్కొన్నారు. రా ష్ట్రంలో బిజెపి ఓటు బ్యాంకు 14 శాతం నుంచి 35 శాతానికి పెరిగిందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే అసెంబ్లీ ఎన్నిక ల్లో అధికారం చేజిక్కించుకోవడమే లక్షంగా చే సుకుని పార్లమెంటు ఎన్నికల తర్వాత భారతీ య జనతా పార్టీ (బిజెపి) తొలి రాష్ట్రస్థాయి వి స్తృత కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్‌లో నిర్వహించారు.

గడచిన పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ఓటు శా తం పెరగడంతో రెట్టించిన ఉత్సాహం మీద ఉ న్న బిజెపి నాయకత్వం ఈసారి ఎన్నికల్లో సత్తా చాటి వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం అయ్యేందుకు దృష్టి సారించింది. రాష్ట్రంలో ఉన్న కాంగ్రె స్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు, ఇచ్చి న హామీల్లో వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందుకు 15 తీర్మానాలను ఆమోదిం చి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెక్‌పెట్టేందుకు నిర్ణయించింది. దీంతో పాటు గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఆదరించి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బిజెపికి ఓట్లు, సీట్లు ఇచ్చిన తెలంగా ణ ప్రజలకు సెల్యూట్ చేశారు. మరోవైపు పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేక ప్రజాగ్రహానికి గురైందని వ్యాఖ్యానించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సంస్థాగత ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల సహా ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నియంతృత్వ, నిరంకుశ పాలనపై సుదీర్ఘ పోరాటం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి, ఎనిమిది నెలలైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ఫిరాయింపులకు పాల్పడుతోందని, రాజకీయ ఫిరాయింపులే అజెండాగా కాంగ్రెస్ పాలిస్తోందని ఘాటైన విమర్శలు చేశారు.

రాష్ట్రాన్ని దోపిడీ చేసి దిల్లీ పెద్దలకు సూట్‌కేసులు పంపుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని కాంగ్రెస్ ఆరోపిస్తోందన్న ఆయన బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటి కాదు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటి అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కవల పిల్లలని, ఈ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలను నెరవేర్చేది బీజేపీ ఒక్కటేనని చెప్పారు. ప్రజా వ్యతిరేకతలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారని బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. భూ, లిక్కర్ మాఫియాను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ప్రోత్సహించాయని ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగాన్ని మారుస్తారని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు విశ్వసించలేదని పేర్కొన్నారు.

15 అంశాలతో రాజకీయ తీర్మానం
రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలపై 15 అంశాలతో రాజకీయ తీర్మానాన్ని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రవేశపెట్టగా ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు బలపర్చారు. రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉన్న నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేయాలనే అంశాన్ని ఈ తీర్మానంలో బీజేపీ పొందుపర్చించింది. తీర్మానాల వివరాలు ఇలా ఉన్నాయి. రుణ మాఫీ వెంటనే అమలు చేయాలిలని, రైతు భరోసా చెల్లింపు, రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థి యువ వికాసం గ్యారెంటీ లను అమలు, క్షీణించిన శాంతి భద్రతలను అదుపులోకి తేవాలి, గ్రామపంచాయతీలో పేరుకుపోయిన బకాయిలను వెంటనే చెల్లించి, గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని తీర్మానాల్లో పేర్కొన్నారు. ఇంకా ధరణి ప్రక్షాళన ఆలస్యం లేకుండా చేయాలని, పునాది పడని ఇందిరమ్మ ఇండ్లను వెంటనే మంజూరు చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సిబిఐకి దర్యాప్తునకు అప్పజెప్పాలని,

ఫోన్ ట్యాపింగ్ అక్రమాలు, ఆ కేసునూ సిబిఐకి అప్పజెప్పాలని, ఫోన్ టాపింగ్ వెనుక ఉన్న శక్తులను గుర్తించి, శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని బిజెపి తీర్మానాల్లో పేర్కొంది. కాగా విద్యుత్ కొనుగోళ్లలో అవినీతిపై జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తును వేగవంతం చేయాలని, ధాన్యం కొనుగోలుకి ఐదు వందల బోనస్ ఇవ్వాలని, గొర్రెల పంపిణీ స్కాంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, అసలైన అవినీతిపరులను గుర్తించి, శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని, వాక్స్, ల్యాండ్, శాండ్, గ్రానైట్, లిక్కర్, డ్రగ్స్ మాఫీయాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని, రేషన్ కార్డులు వెంటనే మంజూరు, ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని, వెంటనే ఫీజు రియంబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం 15 తీర్మానాలను ఆమోదించింది.

తెలంగాణాలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేః బండి సంజయ్
ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని గుర్తించిన తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 లోక్ సభ స్థానాలు కట్టబెట్టారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు, బీజేపీకి విడదీయరాని బంధం ఉందని పేర్కొన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లను గెలిపించారని, ఈసారి 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు అందించి కాంగ్రెస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని నిరూపించారని తెలిపారు. ఏది ఏమైనా రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ తేల్చి చెప్పారు. మోడీ ప్రభుత్వం మూడోసారి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు.

కార్యకర్తల కష్టంతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. మీ పార్టీయే తెలంగాణలో అధికారంలో ఉంది కదా? ఉస్మానియా యూనివర్శిటీలో తిరిగే దమ్ముందా? అని కాంగ్రెస్ నేతలకు సవాల్ చేశారు. ఓయూకి వెళ్లి నిరుద్యోగులను కలిసి వాళ్ల సమస్యలపై మాట్లాడగలరా? అని ప్రశ్నించారు. తెలంగాణలో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ రోజ్ గార్ మేళాతో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోందని, అయినప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోందని రాహుల్ గాంధీ అనడం సిగ్గుచేటని అన్నారు. గ్రూప్- 1 పరీక్షలపై అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నా సర్కార్ పట్టించుకోకుండా వారిపై నిర్భంధకాండ చేస్తోందని ఫైర్ అయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News