Monday, December 23, 2024

వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

- Advertisement -
- Advertisement -

చెన్నారావుపేట: వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వెంటనే మంజూరు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని తరువాత ఎమ్మెల్యేలుగా పనిచేసిన మాధవరెడ్డి, సుదర్శన్‌రెడ్డిలు తన కన్నా ఎక్కువ అభివృద్ధి చేసినట్లయితే తాను ఎన్నికల నుంచి తప్పకుంటారన్నారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడంలో సీఎం కేసీఆర్ ఆరితేరారన్నారు.

ఎన్నికలకు ముందు అర్హులైన ప్రతీ ఒక్కరికీ డబుల్ బెడ్‌రూమ్‌లో కట్టించే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చి నేటి వరకు ఒక డబుల్ బెడ్‌రూమ్ కట్టలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మళ్లీ డబుల్ బెడ్‌రూమ్‌లు కట్టుకునే వారికి రూ. 3 లక్షలు ఇస్తామని ప్రకటించడం మరోసారి ప్రజలను మోసం చేయడమేనన్నారు. అదేవిధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ రూ. లక్ష వరకు చేస్తానని చెప్పి నేడు 2018 లోపు తీసుకున్న వారికే రుణమాఫీ చేస్తామని చెప్పడం బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను మరోసారి మోసం చేయడమేనన్నారు. అదేవిధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ లక్ష వరకు చేస్తానని చెప్పారు. 2018 లోపు తీసుకున్న వారికే రుణమాఫీ చేస్తామని చెప్పడం బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్ధమవుతారన్నారు.

ప్రజలు ఓటువేసే ముందు ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ వడ్డెపల్లి నర్సింహరాములు, నెక్కొండ మాజీ ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, మండల కన్వీనర్ దామెరుప్పల శేఖర్, సీనియర్ నాయకులు వనపర్తి మల్లయ్య, జిల్లా బీజేవైఎం కార్యదర్శి పోతరాజు రాజు, నర్సంపేట మాజీ సర్పంచ్ చిలువేరు రజనీభారతి, శక్తి కేంద్రం ఇన్‌ఛార్జులు రమేశ్, సుధాకర్, శ్రీను, మహేందర్, లక్ష్మయ్య, అమృనాయక్, భద్రయ్య, శక్తి కేంద్రం నర్సంపేట ఇన్‌ఛార్జి విజయరాణి, వీరప్రకాష్, బూత్ అధ్యక్షుడు శ్యామ్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News