Monday, December 23, 2024

ఆర్థిక వ్యవస్థను బిజెపి ప్రభుత్వం నాశనం చేసింది: రాహుల్

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi

జైపూర్: మాజీ యూపిఏ  ప్రభుత్వం బలపరిచిన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడీ నాశనం చేశారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం ఆరోపించారు. రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంస్తూ ఈ విషయం చెప్పారు.   బిజెపి , ప్రధాని మోడీ రెండు హిందుస్థాన్‌లను సృష్టించాలని భావిస్తున్నారని, ఒకటి ధనవంతులకు, ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకు, మరొకటి దళితులు, రైతులు, పేదలు , వెనుకబడిన వారికి అని ఆరోపించారు.

కాంగ్రెస్‌కు ఒక్క హిందుస్థాన్‌ మాత్రమే కావాలి

ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్ నాయకుడు, “బిజెపి ప్రభుత్వం మన ఆర్థిక వ్యవస్థపై దాడి చేసింది. ప్రధాని నోట్ల రద్దు , జిఎస్‌టిని తప్పుగా అమలు చేశారు, దాని వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనమైంది.  ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి యుపిఏ పని చేసింది. కానీ నరేంద్ర మోడీ మన ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించారు. కేంద్రంలోని అధికార పార్టీని దూషిస్తూ, “బిజెపి రెండు హిందుస్థాన్‌లను సృష్టించాలనుకుంటోంది, మాకు ఒక హిందుస్థాన్ కావాలి. ఇది దేశంలో జరుగుతున్న పోరాటం.” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News