Wednesday, January 22, 2025

యూపిలో బిజెపి ప్రభుత్వమంటే మాఫియా రాజ్, గూండా రాజ్‌పై అదుపు: మోడీ

- Advertisement -
- Advertisement -

BJP govt in UP means control over mafia raj Says Modi

సీతాపూర్(యూపి): ఉత్తర్‌ప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వముంటే ‘మాఫియా రాజ్’, ‘గూండా రాజ్’పై అదుపు సాధించడమే కాగలదని, ఇదివరలో బిజెపి ప్రభుత్వం లేనప్పుడు అవి రాజ్యమేలాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ఓ ర్యాలీలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇంకా ఐదు దశలలో జరిగే ఎన్నికల్లో ఓటర్లు బిజెపికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. “బిజెపి ప్రభుత్వం అంటే పండుగలు జరుపుకునేందుకు స్వేచ్ఛ. సోదరీమణులు, కూతుళ్లకు రక్షణ. ఇక్కడ మా ప్రభుత్వం అంటే పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని, కేంద్ర పథకాలపై రెట్టింపు వేగంతో పనిచేస్తుందని అర్థం” అన్నారు. మోడీ ర్యాలీ సీతాపూర్ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ భాగాలు(సెగ్మెంట్‌లను) కవర్ చేసింది. సీతాపూర్ జిల్లాలో ఎన్నికలు ఫిబ్రవరి 23న జరుగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News