Sunday, January 19, 2025

“ఇండియా కూటమి” వస్తే 15 రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాలు పడిపోతాయి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా జోస్యం

పనాజి : లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలోకి ఒకసారి “ఇండియా కూటమి” అధికారం లోకి రాగానే బీజేపీ నేతృత్వం లోని 10 నుంచి 15 రాష్ట్రాల ప్రభుత్వాలు కూలిపోతాయని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా గురువారం జోస్యం చెప్పారు. బహుశా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఇది జరుగుతుందన్నారు. అదే విధంగా పార్టీ ఫిరాయింపులను అరికట్టడానికి, ఫిరాయించిన వారిని అనర్హులను చేయడానికి వీలుగా రాజ్యాంగం లోని 10 వ షెడ్యూల్‌ను ఇండియా కూటమి సవరిస్తుందని చెప్పారు.

దేశం మొత్తం మీద ఫిరాయింపులను పోత్రహిస్తూ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోందని విమర్శించారు. గోవాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వచ్చినప్పుడు ఫిరాయింపులను అరికట్టగలిగే రాజ్యాంగం లోని 10 వ షెడ్యూల్ గురించి ప్రశ్నించాలని మీడియాకు సూచించారు. కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక కేసు గురించి అడగ్గా ఇది ప్రపంచం మొత్తం మీద లైంగిక దాడి జరిగిన అతిపెద్ద కేసుగా పేర్కొన్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తోసహా ప్రతి నాయకుడు దీన్ని ఖండించవలసిందేనని పేర్కొన్నారు. “ ప్రజ్వల్ పాస్‌పోర్టును రద్దు చేసి తిరిగి భారత్‌కు అతడిని రప్పించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే ” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News