Monday, December 23, 2024

బిజెపి వర్గం దాడి

- Advertisement -
- Advertisement -

BJP group attack on TRS activists

గద్వాల జిల్లా వేములలో బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్తత
ఇరువర్గాల మధ్య ఘర్షణ, కార్లు ధ్వంసం

మన తెలంగాణ / గద్వాల ప్రతినిధి: ప్రశాంతంగా సాగు తున్న పాదయాత్రలో ఒక్కసా రిగా సోమవారం టెన్షన్ వా తావరణం నెలకొంది. బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసు కొని ఇరువర్గాలకు చెందిన వాహనాలను ధ్వంసం చేసు కున్నారు. ఇటిక్యాల మండ లం వేముల గ్రామానికి బండి సంజయ్ పాదయాత్ర చేరుకోగానే టిఆర్‌ఎస్ కార్యకర్తలు పెట్రోల్ డీజీల్ ధరలు తగ్గించకుండా పాదయాత్ర ఎలా చేస్తారు అని నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన బిజెపి లీడర్లు టిఆర్‌ఎస్ లీడర్‌పై దాడి చేశారు. దీంతో బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీ లీడర్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని ఇరువర్గాలకు చెందిన వాహనాలను ధ్వంసం చేసుకున్నారు. దీంతో ఇరువర్గాలు నినాదాలు చేసుకున్నారు.

పోలీసులు చేరుకొని ఎక్కడికక్కడే ఇరు వర్గాలను తరిమికొట్టారు. ఈ కాలంలో టిఆర్‌ఎస్ లీడర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. అసత్యాలు చెబితే సహించేది లేదు అలంపూర్ నియోజకవర్గంలో తిరుగుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తే బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటామని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం హెచ్చరించారు. శాంతియుత పాదయాత్ర అంటూ దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వేముల గ్రామంలో అత్యవసర ధరలు గ్యాస్ ధరలు తగ్గించాలని మహిళలు, యువకులు వచ్చి అడిగితే కత్తులతో, కట్టెలతో దాడులు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆయన అబద్ధ్దాలు చెప్పడం మానుకోవాలని లేదంటే ఎక్కడికక్కడ మా కార్యకర్తలు నిలదీస్తారని స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News