Monday, December 23, 2024

యెడ్యూరప్పకు బిజెపి వేధింపులు బహిరంగ రహస్యమే

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంటోంది. ఈ క్రమంలో అధికార బిజెపి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డికె శివకుమార్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్నికల విషయంలో బిజెపి నేత , మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూరప్పపై సొంతపార్టీనే తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోందని ఆరోపించారు. పార్టీ ఆయనను వేధిస్తున్న విషయం బహిరంగ రహస్యమేనని అన్నారు. కర్నాటక వీధుల్లో ఆయన కన్నీళ్లు పారాయన్నారు. బెంగళూరులో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ శివకుమార్ ఈ ఆరోపణలు చేశారు.

కర్నాటకలో బిజెపి ప్రభుత్వం అవినీతికి చిరునామాగా మారిందన్న శివకుమార్ ఈ విషయంలో ప్రధాని మోడీ ఏం చేశారని ప్రశ్నించారు. ‘ ప్రధాని మోడీ కేవలం ఉపన్యాసాలకే పరిమితం అయ్యారు.రాష్ట్రంలో అవినీతిని మాత్రం ఆపలేదు’ అని విమర్శించారు. లింగాయత్‌లను బిజెపి వేధింపులకు గురి చేస్తోందని, వారికి ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ఈ సారి వారి మద్దతు తమ పార్టీకే ఉంటుందన్నారు. రాష్ట్రంలో 140 స్థానాలను గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేసిన ఆయన ముఖమంత్రి ఎవరనే దాన్ని అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News