Monday, December 23, 2024

యోగికి బాగా కలిసొచ్చిన హిందూ ఓట్లు

- Advertisement -
- Advertisement -

BJP has 54 percent Hindu votes poll in UP

54 శాతం ఓట్లు బిజెపికే ..
ఎస్‌పికి 26 శాతం ఓట్లు
బిఎస్‌పికి 14 శాతం
కాంగ్రెస్‌కు రెండు శాతం
విభజిత ఓట్లతో విజేత ఖరారు

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఈసారి హిందూ ఓటు బిజెపి విజయానికి దారి కల్పించింది. హిందూ ఓటర్లలో సగానికి పైగా బిజెపి వైపు మొగ్గుచూపారు. ఇక ముస్లిం ఓటర్లు ఎక్కువగా సమాజ్‌వాది పార్టీకి ఓటేశారు. ఈ విషయం క్రమేపీ జోరందుకుంటున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల సరళి దశలో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల అనంతరం యుపిపై ఎక్కువగా దృష్టి సారిస్తూ విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆది నుంచి బిజెపి ఇక్కడ హిందూ శక్తుల ఓట్లపైనే ఆధారపడింది. సిఎస్‌డిఎస్ లోక్‌నీతి సర్వేలో పలు అంశాలు వెల్లడయ్యాయి. హిందూ ఓట్లలో అర్థభాగం పొందిన బిజెపికి గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ముస్లిం ఓట్ల వాటా కూడా పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఉన్న దానికన్నా ఈసారి ఈ ఓట్లు నామమాత్రంగా పెరిగాయి. ఈ ఎన్నికలలో సమాజ్‌వాదిపార్టీ నేత అఖిలేశ్ యాదవ్ తమ పార్టీకి హిందూ ఓట్ల సమీకరణకు బాగా పాటుపడ్డారు.

ఎస్‌పికి ఈసారి హిందూ ఓటర్లలో వాటా 26 శాతంగా నమోదు అయింది. ఇది గత అసెంబ్లీ ఎన్నికలలో ఉన్న 18 శాతంతో పోలిస్తే 8 శాతం ఎక్కువ. యాదవ్ బిజెపి హిందువుల ఓట్లలో గండికొట్టేందుకు పలు వ్యూహాలకు దిగారు. పలు దేవాలయాలను సందర్శించారు. మఠాలకు వెళ్లారు. యుపి సిఎం యోగి ఆదిత్యానాథ్ తమ చేతలతో మాటలతో చాకచక్యంగానే ఈసారి ఓట్ల సమయంలో విభజన రేఖల వాతావరణాన్ని బాగా సృష్టించగలిగారు. రాష్ట్రంలోని జనాభాలో 80 శాతం వరకూ బిజెపిసర్కారు వైపు మొగ్గు చూపుతున్నారని, ఇంతకు ముందటిలాగానే మిగిలిన 20 శాతానికి విముఖత ఉందని, దీనిని తాము పట్టించుకునేది లేదని ఆయన తరచూ చెప్పారు.ఈ విధంగా ఓటర్లలో హిందూ హిందూయేతర విభజనలు బాగా కమ్ముకున్నాయి.

బిజెపికి 54 శాతం హిందూ ఓట్లు

సిఎస్‌డిఎస్‌లోక్‌నీతి సర్వే వివరాల మేరకు ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో హిందూ ఓట్లలో బిజెపికి 54 శాతం ఓట్లు వచ్చాయి. 217 అసెంబ్లీ ఎన్నికలలో ఈ వాటా 47 శాతంగా ఉంది. బిఎస్‌పికి ఈసారి 14 శాతం హిందూ ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ రెండు శాతం హిందూ ఓట్లను గెల్చుకుంది. ఈపార్టీ ఇక్కడ రెండు సీట్లతోనే సరిపెట్టుకుంది. ఈసారి బిజెపికి ముస్లిం ఓట్లశాతం పెరిగినా విజేతలైన వారిలో ఒక్కముస్లిం వ్యక్తి లేరు. 273 మంది బిజెపి మిత్రపక్షాల విజేతలలో ఒక్కరు కూడా ముస్లిం వ్యక్తి లేరు. ఈసారి 8 శాతం ముస్లిం ఓట్లను దక్కించుకుని ఇంతకు ముందటి 3 శాతం నుంచి మెరుగుపడ్డ బిజెపి ఈసారి పార్టీ తరఫున ఓ ఒక్క ముస్లిం అభ్యర్థిని పోటీకి దింపలేదు. అయితే బిజెపి మిత్రపక్షం అప్నాదశ్ నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి బరిలో నిలిచారు. రామ్‌పూర్‌లోని సురార్ నుంచి ఆజం ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం కు పోటిగా అప్నాదళ్ అభ్యర్థి నిలిచారు. అయితే జూనియన్ ఆజం చేతిలో ఓడారు. ఈసారి బిఎస్‌పికి ముస్లిం ఓట్ల శాతం బాగాపడిపోయింది.

ఈ విధంగా కేవలం ఒక్క సీటుకు పరిమితం అయింది. గత ఎన్నికలలో 19 శాతం వరకూ ఉన్న ముస్లిం ఓట్లను ఈసారి బిఎస్‌పి ఆరు శాతానికి దిగజార్చుకుంది. ఇక ముస్లిం అనుకూలతను ప్రదర్శించారనే ప్రచారం పొందిన కాంగ్రెస్‌కు ఈసారి ముస్లిం వర్గాల నుంచి దక్కిన మద్దతు కేవలం 3 శాతమే. ఇంతకు ముందటి 19 శాతం ముస్లిం ఓట్లు ఈసారి 3 శాతానికి పడిపొయ్యాయి. ఈసారి ఎన్నికలలో బిఎస్‌పి అత్యధికంగా 87 మంది ముస్లింలను పోటికి దింపింది. తరువాతి స్థానంలో కాంగ్రెస్ 75 మందిని, తరువాతి క్రమంలో ఎస్‌పి 64 మంది ముస్లింలను బరిలోకి నిలిపింది. ఈసారి ఎన్నికల్లో 34 మంది ముస్లింలు విజేతులు అయ్యారు. వీరిలో 31 మంది ఎస్‌పి వారే ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News