Friday, September 20, 2024

పార్టీల ఆస్తుల్లో బిజెపి టాప్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోని ఎనిమిది జాతీయ రాజకీయపార్టీల ఆస్తుల నికర విలువ లెక్కల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల సంస్కరణలు, నిఘా సంస్థ ఎడిఆర్ ఈ మేరకు ఎనిమిది రాజకీయ పార్టీలు వరుసగా రెండు సంవత్సరాలలో వెల్లడించిన ఆస్తుల విలువను నివేదికలో తెలిపింది. 202122 సంవత్సరంలో గుర్తింపు పొందిన ఎనిమిది జాతీయ రాజకీయపార్టీల మొత్తం నికర ఆస్తుల విలువ రూ 8829 కోట్లు. అంతకు ముందటి ఏడాది 202021లో ఇది రూ 7,297.62 కోట్లుగా ఉంది. ఈ విధంగా చూస్తే ఏడాదిలో ఈ పార్టీల ఆదాయం ఆస్తులు మొత్తం మీద రూ వేయి కోట్లు దాటాయి. బిజెపి, కాంగ్రెస్, ఎన్‌సిపి, బిఎస్‌పి, సిపిఐ, సిపిఎం, టిఎంసి, రాజస్థాన్‌కు చెందిన ఎన్‌పిఇపి పార్టీల ఆస్తులు రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో ఏ మేరకు ఉన్నాయి? ఏ మేరకు పెరిగాయి? తగ్గాయి? అనేది విశ్లేషించారు.

అయితే ఇది ఆయా పార్టీలు అధికారికంగా సమర్పించుకున్న లెక్కల ప్రాతిపదికన దీనిని రూపొందించడం జరిగింది. ఈ రెండేళ్లలో ఆదాయం లేదా ఆస్తులు తగ్గిన పార్టీ ఒక్క బిఎస్‌పి అని వెల్లడైంది. ఇక ప్రధాన పార్టీలైన బిజెపి కాంగ్రెస్‌ల ఆస్తులు మునుపటిలాగానే పెరిగాయి. 202021 ఆర్థిక సంవత్సరంలో బిజెపి ప్రకటిత ఆస్తుల విలువ రూ 4990 కోట్లు. 2021 2022లో ఇది 6046 కోట్లకు చేరింది. ఈ విధంగా చూస్తే ఏడాదిలో పెరిగిన బిజెపి ఆస్తుల విలువ 21.17 శాతం వరకూ ఉంది. ఈ దశలోనే కాంగ్రెస్ చూపిన లెక్కల ప్రకారం 21లో 691 కోట్లు ఉండగా , 22లో ఇది రూ 805.68 కోట్లకు చేరుకుని నికరంగా 16.58 శాతం వృద్ధిలో ఉంది. ఇక మాయావతి సారధ్యపు బిఎస్‌పి ఆస్తుల విలువ తగ్గుముఖం పట్టింది. అంతకు ముందు ఇవి రూ 732 కోట్లు ఉండగా 22లో రూ 690 కోట్లకు తగ్గాయి.

ఈ దశలోనే టిఎంసి ఆస్తుల విలువ 2022లో విపరీతంగా పెరిగాయి. ఈ లెక్కలను చూస్తే 202021లో ఇవి రూ 182 కోట్లకు పైగా ఉండగా , ఇవి 202122లో రూ 458 కోట్లు దాటాయి. ఈ లెక్కన టిఎంసి ఆస్తుల విలువ 151 శాతానికి పైగా పెరిగింది. ఇక అప్పుల వివరాలను కూడా పార్టీలు ప్రకటిచాయి. ఎనిమిది పార్టీలు తెలిపిన లెక్కల ప్రకారం అప్పులు విలువ మొత్తం రూ 103.55 కోట్లు, కాగా ఇందులో కాంగ్రెస్‌కే ఎక్కువ అప్పులు ఉన్నట్లు తేలింది. ఈ అప్పులు విలువ మొత్తం 41.95 కోట్లు, బిజెపి అప్పులు రూ 5.17 కోట్లు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News