Saturday, December 28, 2024

బడా కార్పొరేట్ మిత్రులే బిజెపి ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -

BJP has no mercy on small traders and poor people

యుపి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక ఆరోపణ

ఘజియాబాద్(యుపి): చిరు వ్యాపారులు, పేద ప్రజల పట్ల బిజెపికి ఏమాత్రం కనికరం లేదని, తన బడా కార్పొరేట్ మిత్రుల కోసమే ఆ పార్టీ పనిచేస్తోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇంటింటి ప్రచారం చేపట్టిన ప్రియాంక శుక్రవారం నాడిక్కడ మాట్లాడుతూ చిరు వ్యాపారాలు చేసే ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెద్ద నోట్ల రద్దు, లాక్‌డౌన్ వంటి చర్యలతో కష్టాలలో కూరుకుపోయిన ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని ఆమె అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే భాష నాగరికంగా ఉండాలంటూ యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఆమె వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు ఎన్నికల అజెండా కావలసి ఉండగా అసందర్భ వ్యాఖ్యలతో రాజకీయాలను పక్కదారి పట్టిస్తున్నారని ఆమె విమర్శించారు. ఈ ప్రభుత్వం కేవలం బడా కార్పొరేట్ మిత్రుల కోసమే పనిచేస్తుందని, చిరు వ్యాపారులు, పేద ప్రజలకు ఇక్కడ స్థానం లేదని ఆమె చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News