Friday, December 27, 2024

భాజాపాది కేవలం మేకపోతు గాంభీర్యం : మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో భాజాపాకు స్థానం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో భాజాపా ఒక్క సీటు మాత్రమే గెలిచిందని మంత్రి పేర్కొన్నారు. భాజాపా తెలంగాణ రాష్ర్టంలో అధికారంలోకి రావడం అనేది పగటి కల అని సూచించారు. దేశంలో ఏ ఒక్క వర్గానికి భాజాపా మేలు చేయలేదని విమర్శించారు. రైతులకు నష్టం చేసే 3 చట్టాలను తెచ్చి రైతులకు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని వాపోయారు. నేడు తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, అభివృద్ధిలో జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు అధికమని హరీష్ రావు వివరించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో బాధపడుతుందని రాష్ట్రా స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కాని నాయకత్వ లేమితో తీవ్రంగా బాధపడుతున్నారని అన్నారు. బిజెపి పాలనలో వాళ్లు చేస్తున్న లోపాలను, ,ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యాలను ఎత్తి చూపడంలో ప్రత్యామ్నాయ ఎజెండా ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని , దేశ ప్రజలు ప్రత్యమ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని ఆ ప్రత్యామ్నాయం కల్పించడం కోసం బిఆర్ఎస్ పార్టీ వచ్చిందని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News