Sunday, December 22, 2024

బిజెపికి బలం లేదు…కాంగ్రెస్ కు అభ్యర్థులు లేరు!

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో హస్తానికి డిపాజిట్లు కూడా రావు

మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం : గజ్వేల్‌లో మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/గజ్వేల్: తెలంగాణలో బిజెపికి బలం లేదని, కాంగ్రెస్ అయితే అభ్యుర్థులే లేరని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌కు గతం తప్ప భవిష్యత్ లేదని అందుకే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఘోరంగా భంగపడిందని హరీశ్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గంలో వివిధ పా ర్టీల నుంచి హరీశ్‌రావు ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడు తూ రాష్ట్రంలో కాంగ్రెస్ డిపాజిట్లు కూడా గజ్వేల్‌లో హస్తం ఖాళీ అవ్వడం ఖాయమని ఆయన  అన్నారు. కాంగ్రెస్‌లో వాళ్లవాళ్లకే గొడవలు జరుగుతుంటాయని ఇక ప్రజల సమస్యలు ఎక్కడ పడతాయని హరీశ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎవరూ ఎన్ని కుయుక్తులు పన్నినా తిరుగులేని పార్టీ ఒక్క బిఆర్‌ఎస్ మాత్రమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఎవరు ఔనన్నా కాదన్నా బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టడం కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఒకప్పుడు ఆం ధ్రాలో ఎకరం భూమి అమ్ముకుంటే తెలంగాణలో ఐదెకరాల భూమి దొరికేదని నేడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఎకరాలు దొరికే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యలే దీనికి నిదర్శనమన్నారు. బిఆర్‌ఎస్ పరిపాలన తీరుకు పక్క రాష్ట్రాల నేతల వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. పార్లమెంట్‌లో కేంద్ర సర్కార్ బిజేపిని ఎం డగట్టడగంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బిజెపి ఎంపిలు పార్లమెంట్ పార్లమెంట సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి రూ. 86వేల కోట్లు ఇచ్చామని ఎంపీ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. 80 పైసలు కూడా ఇవ్వకుండా 86 వేల కోట్లు ఇచ్చామని చెప్పడం బిజెపి నేతలకే చెల్లిందన్నారు.

కెసిఆర్‌ను లక్ష మెజార్టీతో గెలిపించాలని, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ అభివృద్ధిలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. నియోజకవర్గంలో జరగని అభివృద్ధి లేదని గజ్వేల్ నియోజక వర్గంలో రూ. 1200 కోట్ల పెట్టుబడితో కోకాకోలా కంపెనీ స్థ్ధాపించబోతున్నారని, నియోజక వర్గంలో మరికొన్ని పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి కల్పించడం లక్షంగా కంపెనీల నిర్మాణాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలను కూడా బలోపేతం చేయడం ద్వారా ఇక్కడ యువతకు ఉపాధి దొరుకుతుందని పంటల అమ్మకం ద్వారా రైతన్నలు ఆర్థ్ధికంగా బలోపేతం అవుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీ ఇచ్చి కెసిఆర్‌కు ధన్యవాదాలు చెప్పాలన్నారు. రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారం చేపట్టబోతుందని, కెసిఆర్ సిఎం ఆవుతారని మంత్రి హరీశ్‌రావు జోస్యం చెప్పారు. ఆయా పార్టీల నుంచి బిఆర్‌ఎస్‌లో చేరిన నేతలకు మంత్రి హరీశ్‌రావు కండువా కప్పి బిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎంఎల్‌సి డా.యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రోజారాధాకృష్ణ శర్మ ఇతర ప్రజా ప్రతినిధులు, గ్రామాల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News