Monday, December 23, 2024

బిజెపికి విజన్ లేదు: ఓవైసీ

- Advertisement -
- Advertisement -
తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ కోటా తీసేస్తామని అమిత్ షా అన్నాక ఓవైసీ ప్రతిస్పందించారు.

హైదరాబాద్: తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే మాత్రం ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తామని చేవెళ్ల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనడంపై మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగించడమే కాదు, బిజెపి వారికి తెలంగాణ విషయంలో ఓ విజన్ కూడా లేదన్నారు.

అమిత్ షా తన చేవెళ్ల ప్రసంగంలో ‘ మేము మజ్లీస్(ఎఐఎంఐఎం)కు భయపడము. తెలంగాణ ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం, ఓవైసీ కోసం కాదు. ఒకవేళ బిజెపి ప్రభుత్వం ఏర్పడితే మాత్రం రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తాము. ఈ హక్కు కేవలం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబిసిలకు మాత్రమే పరిమితం. ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తే ఆ హక్కు వారికే పోతుంది’ అన్నారు.

అసదుద్దీన్ ఓవైసీ తన ట్వీట్ ద్వారా కేంద్ర మంత్రి అమిత్ షాను టార్గెట్ చేశారు. ‘ఒకవేళ అమిత్ షాకు ఎస్సీ, ఎస్టీ, ఓబిసికు న్యాయం చేయాలని నిజంగా ఉంటే, 50 శాతం రిజర్వేషన్ కోటా సీలింగ్‌ను ఎత్తేయమనండి. అందుకు రాజ్యాంగాన్ని సవరించమనండి. వెనుకబడిన ముస్లింలకు ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారు. దయచేసి సుధీర్ కమిషన్ నివేదికను చదవండి. మీకు అది చేతకాకపోతే, వేరే వాళ్లతో చదివించుకోండి. సుప్రీం కోర్టు స్టే కింద ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి’ అని ఓవైసీ తెలిపారు.

అమిత్ షా తన ప్రసంగంలో భారత రాష్ట్ర సమితిని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ‘కెసిఆర్ తన పార్టీని విస్తరించాలనుకుంటున్నారు. ప్రధాని కావాలన్న ఆయన కల ఎన్నటికీ నెరవేరదు. ఎందుకంటే అక్కడ ఆ సీటు వేకన్సీగా లేదు. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. ప్రధాని పోస్ట్ ఖాళీగా లేదు. 2024లో నరేంద్ర మోడీయే మళ్లీ ప్రధాని అవుతారు కెసిఆర్.  బిజెపికి మళ్లీ మెజార్టీ వస్తుంది’ అని షా చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News