Monday, December 23, 2024

40 మంది ఎంఎల్ఏలను కొనడానికి కేంద్రం రూ. 800 కోట్లు పక్కన తీసి పెట్టింది: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

 

Kejriwal at Rajghat

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు, ఎంఎల్ఏలను కొనుగోలుచేయడానికి కేంద్రం రూ. 800 కోట్లు పక్కకు తీసిపెట్టిందని, ఒక్కో ఎంఎల్ఏకు రూ. 20 కోట్లు ఇచ్చి ప్రలోభపెట్ట చూస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. అసలా డబ్బు ఎవరిదన్నది ప్రజలు గుర్తించాలి, మా ప్రభుత్వాన్ని వారు కూల్చలేరు. మా పార్టీ ఎంఎల్ఏలు వారికి అమ్ముడుపోరు అని ఆయన తేల్చి చెప్పారు. మా ప్రభుత్వం సుస్థిరంగా ఉంది. మంచి పనులు ఇకపై కూడా చేయనుంది అన్నారు. బిజెపి ఎంఎల్ఏలను కొనుగోలు చేయాలన్న ఎత్తుగడను తిప్పికొట్టేందుకు ఆయన వ్యూహాన్ని కూడా సిద్ధం చేశారు. ఆ తర్వాత ఆయన రాజ్ ఘాట్ వెళ్లి మహాత్ముడి సమాధి వద్ద ‘లోటస్ ఆపరేషన్ విఫలం కావాలి’ అని ప్రార్థించారు. ఈ వారం ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇంటిపై సిబిఐ దాడి చేసి  సాధించిందంటూ ఏమీ లేదని ఆయన ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News