Monday, January 20, 2025

బంగారు తెలంగాణ చేసే సత్తా బిజెపికే ఉంది

- Advertisement -
- Advertisement -

మోడీ పాలనలో ఇప్పటివరకు ఒక్క స్కాం జరగలేదు
కరోనా నుంచి పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నాం: మాజీ మంత్రి ఈటెల

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో బిజెపి, బిఆర్‌ఎస్ ఒకటి అయితే తాను ఎందుకు గజ్వేల్‌లో పోటీ చేస్తానని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు, గతంలో టిఆర్‌ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది తప్ప బిజెపి ఎప్పుడు జత కట్టలేదని, కాంగ్రెస్ నాయకులు ఈ రెండు పార్టీ ఒకటని రాజకీయ పబ్బం గడుపుకుంటాయని విమర్శించారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టియుడబ్ల్యూజె ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడారు. బంగారు తెలంగాణ చేసే సత్తా బీజేపీకే ఉందని, ప్రధాని మోదీ పాలనలో స్కాంలు లేవని, దేశ ఆత్మగౌరవం పెరిగిందని ఆయన ప్రజలకు సుస్థిర పాలన అందిస్తున్నారని దేశంలో ప్రజలకు 4 కోట్ల ఇల్లు నిర్మించారని పేర్కొన్నారు. కరోనా అప్పటినుండి 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నారని, మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు 11 కోట్ల మరుగుదొడ్లు కట్టించినట్లు తెలిపారు.

తెలంగాణలో గ్రామాల్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కేంద్ర నిధులతో జరుగుతుందని సిబ్బంది జీతాలు కూడా కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం రూ. 6700 కోట్లు పునరుద్ధరించారని, నిజంగా దేశం అభివృద్ది జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. స్వాతంత్య్రం నుండి ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి కాలేదని,52 శాతం ఉన్నాం కానీ పరిపాలన అందని ద్రాక్షగా మిగిలిదని అందుకే బీజేపీ బీసీ బిడ్డను సీఎం చేస్తా అని ప్రకటిస్తే రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. గెలిపించేది రాహుల్ గాంధీ కాదు ఓట్లు వేసేది కాంగ్రెస్ వారు కాదు ప్రజలేనని బీసీ బిడ్డలను రాహుల్ గాంధీ అవమానపరుస్తున్నారని విమర్శించారు.అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ బీజేపీ నవంబర్ 30వ తేదీన బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. నేను వేలుముద్ర మంత్రిగా పనిచేయలేదని తెలంగాణ ప్రజల కట్టే పన్నులు ఎంతో తెలుసు, ప్రజల అవసరం ఏంటో నాకు తెలుసునని ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకు పూర్తిగా తెలుసు ఏం చేస్తే బాగుపడతామో విషయాలు తెలిసిన నాయకుడునని పేర్కొన్నారు. గజ్వేల్, హుజూరాబాద్ నాకు రెండు కళ్ళు దేశంలో ఒక వర్గాన్ని విస్మరించి ముందుకు పోలేమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ చెప్పారని, సిద్ధాంతాలు డైనమిక్ ఉంటాయన్నారు. గల్ఫ్ దేశాలతో మన దేశానికి మంచి సంబంధాలు ఉన్నాయని మైనారిటీలకు కూడా విశ్వాసం కలిపించిన నాయకుడు మోదీని ప్రశంసించారు. జనసేన పొత్తు అవసరం అని పార్టీకి అనిపించింది అందుకే జత కట్టినట్లు మాకు బలం లేని దగ్గర వారికి సీట్లు ఇచ్చినట్లు ఈ ఎన్నికల్లో తమ పార్టీ 61 సీట్ల పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News