Monday, December 23, 2024

బిజెపి హటావో.. దేశ్ కో బచావో

- Advertisement -
- Advertisement -

వరంగల్ : కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కార్పోరేట్ అనుకూల బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని కా పాడుకునేందుకు బీజేపీ హటావో.. దేశ్ కో బచావో నినాదంతో ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్క ర్ పిలుపునిచ్చారు. జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా క లెక్టర్ ఎదుట బుధవారం మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. ప్రజా, వ్యతిరేక విధానాలు, పరిపాలనను మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని, జాతీయ సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా స్వదేశీ, విదేశీ కార్పోరేట్లకు అమ్మి వేస్తున్నదన్నారు.

డీజిల్, పెట్రోలు, వంటగ్యాస్, ఇతర నిత్యావసర వస్తువు ల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధానమంత్రి ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారన్నారు. కనీస వేతనాలు అమలుచేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలను అ మ్మివేస్తూ ప్రజా సందను లూటీ చేస్తున్నారన్నారు. కార్మికులు పోరా డి సాధించుకున్న పని గంటలను తగ్గిస్తూ యాజమాన్యాలకు అనుకూలంగా రోజుకు 12 నుంచి 15 గంటల పని చేయిస్తున్నారని కేం ద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. స్వదేశీ నినాదం పేరుతో విదేశీ జ పం చేస్తున్నాడన్నారు.

బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా స్పూర్తితో కార్మికులు, ప్రజలు, ఉద్యోగులు ఐక్యం గా బీజేపీని రాబోయే ఎన్నికల్లో ఓండించాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట బిక్షపతి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్ మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌ల ను రద్దుచేయాలని, రైతాంగానికి కనీస మద్దతు ధర ప్రకటించాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దుచేసి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంటు చేయాలని, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భో జనం కార్మికులకు చట్టపరమైన కనీస వేతనాలు చెల్లించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఎంవీ యాక్ట్ 2019 ఎలక్ట్రిసిటీ బిల్లు 2022ను వెనక్కి తీసుకోవాలన్నారు.

ఈ మ హా ధర్నాకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య, ఏఐటీయూ సీ జిల్లా కార్యదర్శి తోట బిక్షపతి, బీఆర్‌టీయూ జిల్లా నాయకుడు నాయిని రవి అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా మహాధర్నాలో కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, మజీ ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి, కా ర్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పుల్ల శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జక్కు రాజుగౌడ్, నాయకులు మద్దెల ఎల్లేష్, నేదునూరి రాజమౌళి, మునిగాల బిక్షపతి, రాజేందర్, శంకర్, సీఐటీయూ నా యకులు గాదె ప్రభాకర్‌రెడ్డి, మెట్టు రవి, బొట్ల చక్రపాణి, వేల్పుల సారంగపాణి, టీఆర్‌ఎస్‌కేవీ నాయకుడు ఎంజాల మల్లేశం, ఐఎన్‌టీయూసీ నాయకుడు మామిడి శ్యాంసుందర్, ఐఎఫ్‌టీయూ నాయకుడు నున్న అప్పారావు, ఆరెల్లి కృష్ణతోపాటు వందలాది మంది కా ర్మికులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News