Thursday, January 9, 2025

బండి సంజయ్ ఔట్.. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి..!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణ, ఎపి రాష్ట్రాల్లో బలమైన పార్టీగా ఎదిగేందుకు బిజెపి హైకమండ్ అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎపి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిని మార్చబోతోంది. ఈ విషయాన్ని ప్రస్తుత రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఫోన్ చేశారని, అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారని తెలిపారు. తనకు కొత్త బాధ్యతలు అప్పగిస్తామని నడ్డా హామీ ఇచ్చారని చెప్పారు. తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను కూడా తొలగిస్తున్నామని, కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించబోతున్నట్లు నడ్డా చెప్పారని వెల్లడించారు.

Also Read: మోడీ వరంగల్ పర్యటన షెడ్యూల్ ఖరారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News