Monday, December 23, 2024

అసమ్మతులకు బిజెపి హైకమాండ్ బుజ్జగింపులు

- Advertisement -
- Advertisement -
ఈటెల, రాజగోపాల్ రెడ్డి హస్తినకు రావాలని ఆదేశం

హైదరాబాద్:  తెలంగాణ బిజెపిలో జరుగుతున్న గ్రూపు తగదాలు, సీనియర్ల వలసలపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. పార్టీని చక్కదిద్దేందుకు ఇటీవల నెలకొన్న తాజా పరిమాణాలపై అగ్రనేతలు ఆరా తీసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. దీంతో మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని హస్తినకు రావాలని ఆదేశించారు. ఈ మేరకు వీరిద్దరు రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమాలకు పలువురు సీనియర్లు దూరంగా ఉండటం, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ శ్రేణులు డీలా పడినట్లుగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చూపి అసంతృప్తి నేతలను బుజ్జగించే పనిపై అధిష్టానం పడింది.

పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్టీలోని పరిస్థితులపై ఇప్పటికే సమాచారం తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇతర పార్టీలకు వెళ్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిని దిల్లీకి రావాలని ఆదేశించడంతో ప్రాధాన్యత సంతరించుకొంది. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పలువురు సీనియర్లను పిలుపించుకొని మాట్లాడాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణ భాజపా నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు చెక్ పెట్టాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News