Thursday, January 23, 2025

తెలంగాణలో విప్లవం మొదలైంది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ బిజెపి 24 గంటల నిరాహార దీక్ష చేపట్టింది. బిజెపి ఆధ్వర్యంలో ఈ దీక్ష రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు కొనసాగనుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణ కోసం 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్ర వచ్చిన తర్వాతా కూగా యువతకు ఉద్యోగాలు రాలేదు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి యువతపై ధ్యాస లేదు. లక్షలాది మంది నిరుద్యోగ యువత రోడ్డునపడ్డారు. తొమ్మిదేళ్ల నుంచి డిఎస్సి వేయలేదు. నిరుద్యోగ భృతి ఎక్కడికి పోయింది. కెసిఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయి. బిజెపి అధికారుంలోకి వచ్చిన తర్వాత అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం. నిరుద్యోగ. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు యువత బుద్ధి చెప్పాలి. ఆర్థిక సాయం చేసి కాంగ్రెస్ ను కెసిఆర్ బలోపేతం చేస్తున్నారు అని అన్నారు.

“పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్. ప్రాజెక్టు అంచనాలు పెంచి అడ్డగొలుగా దోచుకుంటున్నారు. పూర్తికాని ప్రాజెక్టును ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సిగ్గు లేదా. తెలంగాణలో విప్లవం మొదలైంది” అని డికె అరున తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యకమ్రంలో కిషన్ రెడ్డి, డికె అరుణతోపాటు బిజెపి అగ్రనేతలు తరుణ్ చుగ్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మధ్యప్రదేశ్ బిజెపి ఇన్ ఛార్జి మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Also Read: సిఎం కెసిఆర్ దైవభక్తితోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంది: హరీశ్ రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News