Saturday, April 5, 2025

రాకాసిపేట్‌లో గడపగడపకూ బిజెపి

- Advertisement -
- Advertisement -

బోధన్ : మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బోధన్‌పట్టణంలోని రాకాసిపేట్‌లో గడపగడపకే బిజెపి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. పోలింగ్ బూత్‌లోని కుటుంబాల వద్దకు వెళ్లి నరేంద్రమోడీ 9 ఏళ్ల పాలన విజయాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ సుపరిపాలన, సంక్షేమ పథకాల గురించి వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను తెలియజేసే మోడీకి మద్దతు తెలుపడానికి ప్రతి ఒక్కరు 909090 2024 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్‌రెడ్డి, బిజెపి జిల్లా కార్యదర్శి సుధాకర్‌చారి, బోధన్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక బాలరాజు, వివిధ మోర్చాల అధ్యక్షుడు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News