Friday, November 15, 2024

80 శాతం పడిపోయిన బిజెపి ఆదాయం

- Advertisement -
- Advertisement -

BJP income fell by almost 80 percent

న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఈసారి బిజెపి ఆదాయం పడిపోయింది. దాదాపు 80 శాతం ఈ వనరు తగ్గి 2021 ఆర్థిక సంవత్సరంలో రూ 752 కోట్లకు చేరిందని వెల్లడైంది. ఎన్నికల సంఘానికి బిజెపి పార్టీ వార్షిక ఆడిట్‌ను సమర్పించుకుంది. 202021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడిచిన నెల 21వ తేదీన దీనిని అందించారు. ఈ మేరకు బిజెపి తమ మొత్తం వ్యయ పద్దులను రూ 620.93 కోట్లుగా చూపింది. ఇక వసూళ్లును రూ 752 కోట్లుపై మాటగా తెలిపింది. హెలికాప్టర్లు అద్దెకు తీసుకోవడం, యాడ్స్, హోర్డింగ్స్, కటౌట్స్ , అభ్యర్థులకు ఆర్థిక సాయం, ఇతరులకు గ్రాంట్లు వంటి అంశాలను వ్యయపద్దులో చూపారు. కరోనా కష్టకాలపు దశలో ఈ ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందటి రూ 2555 కోట్ల స్థాయి నుంచి తగ్గుముఖం పట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News