Sunday, January 19, 2025

బిజెపోళ్లు అంబేడ్కర్ ను అవమానిస్తున్నారు: రాహుల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: బిజెపి నేతలు రాజ్యాంగం, డా బిఆర్ అంబేడ్కర్‌ను అవమానిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్ సభలో అంబేడ్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పార్లమెంట్ ఆవరణంలో కాంగ్రెస్‌ ఎంపిలు నిరసనకు దిగారు. కాంగ్రెస్ కు పోటీగా బిజెపి నేతలు ఆందోళన చేపట్టడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో బిజెపి ఎంపి ప్రతాప్ సారంగీ గాయపడ్డారు. బిజెపి ఎంపి సారంగీ కిందపడటంపై రాహుల్ స్పందించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.

పార్లమెంటులోకి వెళ్తుండగా బిజెపి ఎంపిలు అడ్డుకున్నారని, తనని, మల్లికార్జున ఖర్గేను బిజెపి ఎంపిలు వెనక్కి నెట్టేశారన్నారు. కాంగ్రెస్, బిజెపి ఎంపిల తోపులాటలో సారంగీ పడ్డారన్నారు. బిజెపి ఎంపి సారంగీ కిందపడ్డ దృశ్యాలు మీడియా కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయని రాహుల్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో అంబేద్కర్ జపం చేయడం ఫ్యాషన్ గా మారిందని, వారు అలా అన్ని సార్లు భగవంతుని నామం జపిస్తే స్వర్గంలో చోటు పొంది ఉండేవారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News