అమరావతి: రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ ఎంతో సరళంగా ఉండేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. పరిపాలన దక్షతకు శ్రీరాముడు మారుపేరు అని ప్రశంసించారు. శ్రీరాములు దేశ ప్రజలందరికీ ప్రేరణ అని తెలిపారు. అక్రమంగా వచ్చే అధికారిన్ని స్వీకరించొద్దని రాముడు చెప్పావారని, ఆధర్మ మార్గంలో వచ్చేది ఇంద్రప్రస్తామైన తనకు అక్కరలేదని రాముడు చెప్పారని, రామరాజ్యం అనేది నిజమైన ప్రజాస్వామ్యమని గాంధీ చెప్పారని గుర్తు చేవారు. తాను ఎల్లప్పుడూ ధర్మ పక్షానే నిలుస్తానని రాముడు చెప్పారని పేర్కొన్నారు. జిఎస్‌టి రూపంలో కొత్త పన్నుల వ్యవస్థను తీసుకొచ్చామని స్పష్టం చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. పాలసముద్రం సమీపంలో నాసిన్ శిక్షణా కేంద్రాన్ని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
భూమిపై నీటిని గ్రహించి ఆవిరై తిరిగి వర్షంగా కురిసినట్లుగా పన్నులు ఉండాలన్నారు. ఆదాయపన్ను చెల్లింపు విధానం సులభతరం చేయడంతో పన్ను చెల్లించేవారి సంఖ్య ఏటా పెరుగుతోందని వివరించారు. వచ్చే పన్నులతో దేశంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. పేదలు, రైతులు, మహిళలు, యువకుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వారి కోసం పదేళ్లుగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మోడీ వివరించారు.
మా పథకాలు కాగితాలపై కాదని, క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని తెలిపారు. పేదల సమస్యలు తొలగించడమే ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని, తొమ్మిదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని, పేదల జీవితాలు బాగుపడ్డాయనే విషయం నీతి ఆయోగ్ చెప్పిందన్నారు. వివిధ ఉపాధి అవకాశాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చామని మోడీ స్పష్టం చేశారు. అనేక కార్యక్రమాల వల్ల మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరుగుతోందని, తాము వచ్చాక వాణిజ్య విధానాన్ని సులభతరం చేశామన్నారు.