Monday, December 23, 2024

బిజెపికి గుజరాత్ ఓటమి భయం

- Advertisement -
- Advertisement -

BJP is afraid of defeat in Gujarat:Kejriwal

అందుకే ఆప్ అణచివేసేందుకు కుట్ర
ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణ

న్యూఢిల్లీ: గుజరాత్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయం బిజెపిని వెంటాడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అందుకే అవినీతిపై పోరాడుతున్నామని చెబుతూ ఆమ్ ఆద్మీని అణచివేసేందుకు కాషాయ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు.ఆదివారం ఇక్కడ దేశవ్యాప్తంగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులతో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన స్రసంగిస్తూ తమ పార్టీకి చెందిన మంత్రులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ‘ గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి బిజెపి జీర్ణించుకోలేకపోతోంది. దీంతో మా పార్టీ మంత్రులు , ఎంఎల్‌ఎలపై తప్పుడు అవినీతి కేసులు పెడుతోంది. వీటితో పాటు గుజరాత్‌లో మా పార్టీకి కవరేజ్ ఇవ్వొద్దంటూ టీవీ చానళ్ల ఓనర్లు, వాటి ఎడిటర్లకు ప్రధాని సలహాదారుడు హిరేన్ జోషీనుంచి హెచ్చరికలు వెళ్లాయి. ఇటువంటి చర్యలు ఆపండి’ అని బిజెపిపై కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. గుజరాత్‌లో ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు తమదేనన్నఆమ్ ఆద్మీపార్టీ చీఫ్.. కేవలం నిజాయితీ లేని వ్యక్తులు మాత్రమే ప్రజలకు ఉచితాలు ఇవ్వడం మంచిది కాదని వాదిస్తారని అన్నారు.

ఆరు సూత్రాల అజెండా..

భారత్‌ను ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా నిలబెట్టాలంటే 130 కోట్ల మంది మద్దతును కూడగట్టాల్సిన అవసరం ఎంతయినా ఉందని కేజ్రివాల్ తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆయన ఆరు పాయింట్ల అజెండాను ప్రకటించారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, ఐదేళ్లలో పేదరికాన్ని తగ్గించడం, యువతకు ఉపాధి కల్పన, మహిళలకు భద్రత, సమాన అవకాశాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, రైతులు పండించిన పంటకు పూర్తిస్థాయి ధర లభించేలా చూడడం ఈ ఆరు పాయింట్ల అజెండా అని ఆయన చెప్పారు. మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఆప్ జాతీయ స్థాయి సమావేశానికి ఢిల్లీకి చెందిన మొత్తం 62 మంది ఆప్ ఎంఎల్‌ఎలు, పంజాబ్‌నుంచి 92 మంది పార్టీ ఎంఎల్‌ఎలు, ఢిల్లీ, పంజాబ్‌నుంచి ఎన్నికైన పదిమంది రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News