Thursday, January 23, 2025

రానున్న ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం

- Advertisement -
- Advertisement -

నిర్మల్ అర్బన్ : నిర్మల్ పట్టణంలోని మంజూలాపూర్ శక్తి కేంద్రం పోలింగ్ బూత్ అధ్యక్షులు సమావేశం ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు పెద్దపల్లి జిల్లా ఇంచార్జీ రావుల రాంనాథ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని రెండు పార్టీలు కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి, కానీ తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీల కుట్రలను గమనించడం జరుగుతున్నది. ఒక పక్కన కెసిఆర్ బిజెపిని కేంద్రంలో అధికారంలోకి రాకుండా కాంగ్రెస్‌తో కుమ్మక్కై అడ్డుకోవాలని చూడడం, మరోపక్క తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి బిఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు సేరీ 45 సీట్లు వస్తాయని మాట్లాడడం ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం జరుగుతున్నది.

వాస్తవానికి ఏ సర్వే చూసినా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తెలుపుతుండగా దీని నుంచి ప్రజలను పక్కదారి పట్టించి బిజెపిని దెబ్బతీసి దొంగ చాటున అధికారంఓలకి రావాలని ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణలో బిఆర్‌ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం కమ్యూనిస్టూ పార్టీలు ఒక్కటై బిజెపికి వ్యతిరేకంగా పనిచేయడం కలిసి పోటీ చేయడం సంకేతాలు ప్రజలకు తెలిసిపోయినాయి.

దీని కోసం పోలింగ్ బూత్ స్థాయిలోపార్టీని పటిష్టం చేసి ఇటీవల మాజీ శాసన సభ్యులు మహేశ్వర్ రెడ్డితో కమిటీలో చేర్చి సమన్వయంతో వాటిని పట్టణంలో పటిష్టం చేస్తే రాబోయే ఎన్నికల్లో బిజెపి అఖండ మెజార్టీతో గెలిచే విధంగా కార్యకర్తలు కృషి చేస్తూ ఈ పార్టీ బాగోతం ప్రజలకు తెలియజేసి బిజెపిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అయిండ్ల రమేష్, లింగం, మగిగ్డి రమేష్, లింగం, శ్రీకాంత్, రాజ, లింగా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News