Thursday, December 26, 2024

బిజెపి మతతత్వ రాజకీయాలు

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని క ల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రైతు బంధు రైతుల పాలిట చుట్టంగా మారిందని అన్నా రు. రైతులకు 3 గంటల విద్యుత్ ఇస్తామనడం ఆ యన అహంకార పూరిత మాటలకు నిదర్శనమన్నారు. రేవంత్ రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చాడని దుయ్యబట్టారు. తెలంగాణ రైతుల మనోభావాలను తన సభల్లో చులకనగా చేసి రైతులను కించపరిచాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఆనా డు రైతుల ఉసురు పోసుకుందని రైతులను బాధపెట్టిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని గుర్తు చేశారు. దేశం బిజెపి, కాంగ్రెస్ పాలనలో రైతులు తెచ్చిన అప్పు తీర్చలేక లక్షలాది మంది రైతులు బ లవంతపు చావుకు గురయ్యారని అన్నారు. కెసిఆర్ పాలనలో రైతులకు పెద్దపీట వేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ 700 మె గావాట్లు ఉండగా నేడు 21 వేల మెగా వాట్ల విద్యు త్ ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగేలా చేశారన్నారు.

* బిజెపివి మతతత్వ రాజకీయాలు
దేశంలో ప్రధాని నరేంద్ర మోడి ప్రభుత్వం మతత త్వ రాజకీయాలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. తెలంగాణలో 30లక్షల పంపు సెట్ల కు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తుంటే బిజెపి మాత్రం మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తుందన్నారు. 12 వేల కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు మాఫీ చేసి బకాయిలను తెరాస ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. 65 వేల కోట రూపాయల రైతు బంధును అందజేసిందని పేర్కొన్నారు. లక్ష మంది రైతులకు రైతు భీమా అందించిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని అన్నారు.

నల్ల చట్టాలు తెచ్చిన మోడిని నమ్మరు
దేశంలో నరేంద్ర మోడి ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చి రైతులను తీవ్ర సంక్షోభంలో నెట్టివేసిందన్నా రు. ఉత్తర భారతదేశంలో వేల మంది రైతుల ఆకలి చావులకు మోడి ప్రభుత్వం కారణమని అన్నారు. కేంద్ర మంత్రులు రైతుల మీద వా హనాన్ని నడిపి చంపిన ఘనత బిజెపి పాలకులదని అన్నారు.

* మోడి నల్ల ధనం వెనక్కి తెస్తానని ప్రజలను మోసం చేశారు
దేశంలో బడా పారిశ్రామిక వేత్తలు దేశంలో దోచుకున్న సొత్తును విదేశాల్లో దాచుకున్నారని వారి నుంచి నల్ల సొత్తును దేశానిక తెప్పించి జంధన్ ఖా తాల ద్వారా ప్రతి భారతీయునికి 15 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ ఏమైందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రశ్నించారు. ఉమ్మడి సివిల్ కోడ్ బిల్లును బిఆర్‌ఎస్ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో బిజెపి పాలిత, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలో కూడా లేవని తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు దేశానికి ఆదర్శమని అన్నారు. ఈ సమావేశంలో కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ సింగం విజయ్ గౌడ్, మున్సిపల్ చైర్మెన్ ఎడ్మ సత్యం, ఎంపిపి సామ మనోహర చెన్నకేశవులు, వైస్ ఎంపిపి కొండూరు గోవర్ధన్, జెడ్పిటిసి విజిత రెడ్డి, కౌన్సిలర్‌లు సూర్య ప్రకాష్ రావు, మనోహర్ రెడ్డి నాయకులు పొనుగోటి భాస్కర్ రావు, రామకృష్ణ, కిషోర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News