Monday, December 23, 2024

పచ్చటి తెలంగాణానా.. ‘నెత్తుటి తెలంగాణానా’?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో : ‘తెలంగాణ పంట నీటి కాల్వల్లో నీరు పారించి పచ్చ టి తెలంగాణను అందించిన సీఎం కెసిఆర్ పాలన కా వాలా.. మతం పేరుతో మంటలు రగిలించి నెత్తుటి తెలంగాణగా మార్చడానికి కుట్ర పన్నుతున్న మతతత్వ శక్తులు కావాలా?’ అనేది ప్రజలే తేల్చుకోవాల ని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం చీఫ్ విప్ వినయ్ భాస్కర్ నేతృత్వంలో మంత్రి పలు ప్రా రంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం కాజీపేట సేయింట్ గ్యాబిల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. తెలంగాణలో 2014కు ముందు కరువు విలయ తాండవం చేస్తే సిఎం కెసిఆర్ ప్రాజెక్టుల ద్వారా కాల్వల్లో నీటిని పారించి పచ్చదనాన్ని పెంచారని అన్నారు. అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రంపై మతశక్తులు, బిజెపివాదులు విషం చిమ్ముతూ ప్రజల మధ్య మంటలు లేపుతున్నారని ఆరోపించారు. వరంగల్ గడ్డ చైతన్యవంతమైందన్నారు. ఇక్కడ అభివృద్ధి కూడా హైదరాబాద్‌ను మించి చేపట్టాలని వరంగల్‌లో రూ. 1116 కోట్లతో 24 అంతస్తులతో హెల్త్ సి టీని నిర్మిస్తున్నామన్నారు. అలాంటి మహానగరంలో బీజేపీ అబద్ధాలు, దగాకోరు మాటలు మాట్లాడుతూ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు.

ఎలక్షన్ల స మయం రాగానే బిజెపి, కాంగ్రెసోల్లు మళ్లీ ప్రజల్లోకొచ్చి అయోమయానికి గురిచేస్తూ మసిబూసి మారేడుకాయ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దులవలే సమానంగా తీసుకెళ్తూ ప్రజల మన్ననలు పొందుతున్నామన్నారు. బిజెపి, కాంగ్రెస్ నాయకులు స్వలా భం కోసం ఎంతటి నీచానికైనా తెగిస్తారని వీరిని కల లో కూడా నమ్మవద్దని కెటిఆర్ ప్రజలకు సూచించా రు. రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి ఆయ న ఆశయ సాధనకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధి దేశం నుంచి ప్రశంసలు వస్తుంటే బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక ఇష్టం విమర్శలు చేస్తున్నారని వీరికి రానున్న ఎ న్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని బ ద్నాం చేసేందుకు పదవ తరగతి ప్రశ్నాపత్రాలను లీక్ చేయించారని అన్నారు. దానిపై పోలీసులు విచారణ జరిపి దోషులను జైలుకు పంపితే విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు ఆడుకున్న బండి సంజయ్‌ని దండలతో ఊరేగించారని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీలు ఇచ్చి తొమ్మిదేళ్లు అవుతున్నా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇస్తానన్న 18కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయలేదు.

పైగా వరంగల్‌లో బిజెపి నిరుద్యోగ మార్చ్ నిర్వహించింది. నిజానికి ఇది రాజకీయ నిరుద్యోగుల మార్చ్ అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి మోడీ దేశాన్ని దోచి దోస్తులకు పెడుతున్నారని అన్నారు. జన్‌ధన్ ఖాతాలు తెరిస్తే నల్లధనాన్ని తెచ్చి మీ ఖాతాల్లో వేస్తామన్న డబ్బులు ఒక్క రూపాయన్నా వచ్చిందా అని ప్రశ్నించారు. రూ.400లు ఉన్న సిలిండర్ ధర రూ.1100 అయిందని, దానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎవరి సహకారం లేకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే బిజెపి అభివృద్ధిని అడ్డుకుంటుందన్నారు. దేశ వ్యాప్తంగా మెడికల్ కళాశాలలు మంజూరు చేసిన ప్రధాని మోడీ రాష్ట్రానికి ఒక మెడికల్ కళాశాల కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాజీపేట కోచ్ ప్యాక్టరీపై బిజెపి రాజకీయం చేస్తూ తొమ్మిదేళ్లు గడిచినా కొర్రీలు పెడుతూ కోచ్ ప్యాక్టరీకి మంగళం పాడిందన్నారు.

విభజన చట్టంలోని హామీలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. సిఎం కెసిఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వాన్ని దేశప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఆయన విజన్ వల్లే వరంగల్‌కు మరో నాలుగు ఐటి కంపెనీలు వచ్చాయని, ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై ఇప్పుడే సంతకాలు చేసి వస్తున్నానని అన్నారు. ఇంకా మరిన్ని కంపెనీలు రావాల్సి ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో బిఆర్‌ఎస్ పార్టీకి దేశ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతారని, మతాల పేరుతో మనుషుల మధ్య చిచ్చురేపడమే తెలిసిన ప్రధాని మోడీ వంటి నాయకులను ఇంటికి పంపడం ఖాయమని మంత్రి కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News