Monday, December 23, 2024

ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బిజెపి

- Advertisement -
- Advertisement -

శామీర్‌పేట: బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందని తూం కుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి, శామీర్‌పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్‌గౌడ్‌లు అన్నారు. శుక్రవారం శామీర్‌పేట మండలం తూంకుంట మున్సిపాలిటీలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రాహు ల్ గాంధీపై పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేపించాలనే దురుద్దేశంతో కోర్టులలో తప్పులు కేసులు పెట్టి సభ్యత్వాన్ని రద్దు చేపించేలా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్నారు. ఇందుకు నిరసనగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి పిలుపునివ్వడంతో, టీపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు దిష్టిబొమ్మను దగ్ధం చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళి గౌడ్, ధర్మారెడ్డి, హరిగోపాల్, బిక్షపతి, రాజు, రామ్ చందర్ యాదవ్, దుర్గ య్య, బాల్ రాజు, నర్సింగ్ యాదవ్, సుధాకర్ యాదవ్, మహేశ్, రమేష్, కార్తీక్ రెడ్డి, మహేష్, బల్వంత్‌రెడ్డి, రాజు యాదవ్, శ్రీకాంత్, కొండల్ రెడ్డి, మణిదీప్ రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News