Thursday, January 23, 2025

ఉత్తర తెలంగాణలో బిజెపి బలం పుంజుకుంటుంది

- Advertisement -
- Advertisement -

బిజెపిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చేరిక
ఉమ్మడి ఆదిలాబాద్‌లో 10 సీట్లు గెలుచుకుంటాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్ర బిజెపిలోకి వివిధ పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం ప్రారంభమైంది. మొన్నటి వరకు కాషాయం నుంచే పార్టీని వీడే వారి సంఖ్య భారీ ఉంటుందని భావిస్తే.. ఆపార్టీకి గత రెండు రోజులుగా పలు పార్టీలకు చెందిన నాయకులు చేరుతున్నారు. తాజాగా సోమవారం కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు కమలం పంచన చేరారు. కార్మిక సంఘాల నాయకునిగా గుర్తింపు పొందిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవ్ రావు, అమరు రాజుల శ్రీదేవి రాజేశ్వర్ రావు, ఆమె భర్త బెల్లంపల్లి మాజీ మున్సిపాల్ ఛైర్మెన్ రాజేశ్వర్ రావును కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. మాజీ శాసనసభ్యులు సంజీవ రావు, శ్రీదేవి తమ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని షెడ్యూల్ కులాలకు చెందిన ఇద్దరు మాజీ శాసనసభ్యులు పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కార్మికరంగంలో కీలక పాత్ర పోషించిన సంజీవ రావు. అదే విధంగా బెల్లంపల్లి మాజీ శాసన సభ్యురాలు చేరడంతో ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి పూర్తి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో బిజెపి మరింత బలపడటం కోసం సమిష్టి నాయకత్వంతో ముందుకు వెళ్తుతున్నట్లు, అధికార పార్టీ వైఫల్యాలను పూర్తిగా ఎండగట్టేలా పోరాటం చేస్తుమన్నారు. కాంగ్రెస్,మజ్లిస్ పార్టీలు ఒక్కటై బీజేపీ మీద కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు పది గెలుస్తామని ఇప్పటికే పది మంది సీనియర్ నేతలు మాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్,ఎంఐఎం, బిఆర్‌ఎస్ పార్టీలను ఓడించేది బిజెపి పార్టీనే ప్రజల్లో నమ్మకం ఉంది ఈమూడు పార్టీలు కుటుంబ పార్టీలే.

వారికి దేశం, ప్రజల కంటే కుటుంబమే ఎక్కువ ఇష్టమన్నారు. పార్లమెంట్ లో ముగ్గురు కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టారని దీని తెలంగాణ సమాజం గమనించాలని అవినీతి, నియంత పార్టీలు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమాతో వ్యక్తం చేశారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించామని, వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహిస్తుందన్నారు. కేంద్రం ఇచ్చిన రూ. 900 కోట్ల నిధులు ఉన్నా ప్రభుత్వం ఖర్చు చేయడం లేదన్నారు. సోయం బాపురావు గిరిజన రిజర్వేషన్లపై చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని, ప్రకటనపై వివరణ తీసుకుంటామని, గిరిజన రిజర్వేషన్ల కోసం చేసే పోరాటంలో బిజెపి ముందుంటుందని తెలిపారు.పేదల కల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు అర్హులకు పంపిణీ చేసేవరకు పోరాటం చేస్తామని, కేంద్రం పీఎం ఆవాజ్ యోజన కింద ఇచ్చే నిధులను ఖర్చు చేయాలని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News