నల్గొండ: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ఆరోపించారు. మునుగోడ్ నియోజకవర్గ పరిధిలోని నాంపల్లిలో మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడమే బిజెపి లక్ష్యమా? ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర, గోవా సహా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన దుర్మార్గపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్నారు. తెలంగాణలో ఎంఎల్ఏలను కొనుగోలు చేయాలని ప్రయత్నించి అడ్డంగా దొరికారని చెప్పారు. ఒక్కో ఎంఎల్ఏకు 100 కోట్లు ఆశ చూపారని వెల్లడించారు. ఇన్ని కోట్ల నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి వ్యవహరిస్తున్న తీరును ప్రజలు అసహించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక నైనా రాజ్యాంగాన్ని గౌరవించి తమ పద్ధతిని మార్చుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బిజెపి: మంత్రి తలసాని
- Advertisement -
- Advertisement -
- Advertisement -