Tuesday, March 4, 2025

స్వప్రయోజనాల కోసం రాహుల్‌ని హీరో చేస్తోన్న బీజేపీ : మమతాబెనర్జీ

- Advertisement -
- Advertisement -

బహరంపూర్ (పశ్చిమబెంగాల్ ) :పార్లమెంట్‌లో ప్రజాసమస్యలు చర్చకు రానీయకుండా స్వప్రయోజనాల కోసం బీజేపీ పార్లమెంట్‌ను ప్రతిష్ఠంభింప చేస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈమేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని హీరోగా చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మమతాబెనర్జీ ఘాటుగా విమర్శించారు. ముర్షీదాబాద్ జిల్లాలో ఆదివారం టిఎంసి అంతర్గత సమావేశంలో కార్యకర్తలతో మమతా బెనర్జీ ఫోన్‌లో మాటాడినప్పుడు బీజేపీ, కాంగ్రెస్ వైఖరులపై తీవ్రంగా వ్యాఖ్యలు చేశారని టిఎంసి నాయకుడు తాహెర్ చెప్పారు.

బీజేపీతో పోరాటం సాగించడంలో కాంగ్రెస్ విఫలమైందని దీనికి పశ్చిమబెంగాల్‌లో బీజేపీపై కాంగ్రెస్ మౌనం వహించాన్ని ఆమె ఉదహరించినట్టు తాహెచ్ చెప్పారు. కాంగ్రెస్, బిజేపిలకు దూరంగా, తాను 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇతర ప్రాంతీయ పార్టీలతో చర్చలుసాగిస్తానని మమతా బెనర్జీ ప్రకటించిన రెండు రోజుల తరువాత రాహుల్‌పై మమత విమర్శల దాడి చేయడం గమనార్హం. విపక్షాలకు కాంగ్రెస్ బిగ్‌బాస్ కాదని మమత వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News