Sunday, December 22, 2024

బిజెపిని ఎట్టి పరిస్థితుల్లో వీడడం లేదు

- Advertisement -
- Advertisement -

* వార్త అవాస్తవం * డీకే అరుణ సన్నిహితులు

మహబూబ్ నగర్  : బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎట్టి పరి స్థితులలో భారతీయ జనతా పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని డీకే అరుణ సన్నిహితులు చెప్పారు. బిజెపి అగ్ర నాయకత్వం డీకే అరుణ సేవలు గుర్తించి జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీని వీడుతున్నట్లు ’మన తెలంగాణ’లో వచ్చిన వార్త నిజం కాదని వారు తెలిపారు. బిజెపి కేంద్ర నాయకత్వంలో డీకే అరుణ కు మంచి గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఇలాంటి నిరాదరణమైన వార్తలు రాయడం మంచిది కాదని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News