Monday, January 20, 2025

బిజెపి అధికారంలోకి రావడం ఖాయం

- Advertisement -
- Advertisement -

బాలాపూర్: తెలంగాణలో చాపక్రింద నీరులా విస్తరిస్తూ,నిశ్శబ్ద విప్లవంగా మారి ప్రజలకు దగ్గర అవుతున్న బిజెపి రానున్న ఎన్నికల్లో అధికార బిఆర్‌ఎస్‌పార్టీని ఓడించి అధికారంలోకి రావడం ఖాయమని ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,సింగిల్ విండో మాజీ ఛైర్మెన్ కొలన్ శంకర్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవారం బడంగ్‌పేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు సీనియర్ నాయకులు నిర్వహించిన ప్రజాసంగ్రామయాత్ర,శక్తికేంద్రాల సమావేశాలు,జన్‌సంపర్క్ అభియాన్ పాదయాత్రలు సంపూర్ణంగా విజయవంతం అయ్యాయని అన్నారు.

బిజెపి జాతీయ నాయకులు,కేంద్ర మంత్రులు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న జన్‌సంపర్క్‌అభియాన్ సభలు,సమావేశాలు పార్టీకి అదనపు బలాన్ని చేకూరుస్తుండంతో రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపియే అన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారని అన్నారు.బిఆర్‌ఎస్,కాంగ్రెస్ నాయకులు నోరుతెరిస్తే బిజెపిపైనే విమర్శలు చేస్తున్నారని,కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి ఇప్పటికే నాలుగు పార్టీలు మారాడని,నాయకత్వలోపంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రేవంత్‌రెడ్డిని తమపార్టీకి అధ్యక్షుడిగా అరువు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.ఉద్యమ సమయంలో బూత్‌స్ధాయి నుండి ఢిల్లీ వరకు జైతెలంగాణ నినాదాన్ని బలపరుస్తూ పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే విధంగా కాంగ్రెస్‌పై అప్పటి తమపార్టీ ఎంపి సుష్మాస్వరాజ్ పోరాటం చేస్తుంటే రేవంత్‌రెడ్డి మాత్రం తెలంగాణ ద్రోహులపార్టీ అయిన టిడిపికి అండగా నిలబడి తుపాకులతో తెలంగాణ వాదులను భయ,భ్రాంతులకు గురిచేశాడని మండిపడ్డారు.2009 డిసెంబరు 9వ తేదీన సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా అర్ధరాత్రి తెలంగాణ ఏర్పాటు ప్రకృయను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి,24 గంటలు గడవక ముందే యూటర్న్ తీసుకొని,రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని వెనుక్కు తీసుకున్న కాంగ్రెస్‌పార్టీ కారణంగా 1200 మంది తెలంగాణ విద్యార్ధులు,యువకులు ఆత్మబలిదానాలకు అన్నారు.బిఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పొందాన్ని కుదుర్చుకున్న కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ఇచ్చింది,తెచ్చింది మేమే అంటూ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

విజ్ఙలు,చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు అని,1983లో తెలుగుదేశం పార్టీకి,2014లో తెలంగాణ వాదానికి నిశ్శబ్ద విప్లవం తరహాలో ప్రజలు పట్టం కట్టిన విధంగానే రానున్న ఎన్నికల్లో బిజెపికి సైతం తెలంగాణ ప్రజలు పట్టం కట్టనున్నారని అన్నారు.ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి నరేంద్రమోడి నాయకత్వాన్ని చూసి భయపడుతున్న కాంగ్రెస్ బిజెపి వ్యతిరేక కూటమి కుట్రలకు తెరలేపిందని ధ్వజమెత్తారు.కేవలం బిజెపిపార్టీ ప్రయోజనాల కోసం మాత్రమే తమ అధిష్ఠానం నిర్ణయాలు ఉంటాయని,అధినాయకత్వం నిర్ణయాలు తమకు శిరోధార్యం అని అన్నారు.తమపార్టీ అంతర్గత వ్యవహారాలను కాంగ్రెస్ పనికట్టుకొని రాజకీయం చేస్తుందని,బిఆర్‌ఎస్‌పార్టీ ఇప్పటికే సొగం ఖాళీఅయ్యిందని విమర్శించడంతో పాటు కాంగ్రెస్ నాయకులకు విలువలు ఎక్కడ ఉన్నాయని ఈ సందర్భంగా శంకర్‌రెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News