Saturday, December 21, 2024

రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి గద్దెనెక్కాలని చూస్తున్న బిజెపి : సంపత్ కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాల్లోని విపక్ష ప్రభుత్వాలను కూలద్రోసి అనైతికంగా గద్దెనెక్కాలని చూస్తోందని ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజా స్వామ్యం గెలుస్తుందని మరో సారి జార్ఖండ్ లో రుజువయ్యిందని ఆయనన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దేశంలోని అన్ని వర్గాలకు రక్షణ ఉంటుందని… అందుకే జార్ఖండ్ ఎంఎల్‌ఎలకు హైదరాబాద్ లో రక్షణ కల్పించినట్లు తెలిపారు.

12వ తేదీన బీహార్ లో మరోసారి ప్రజా స్వామ్యం గెలవబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు, బీహార్ ఎంఎల్‌ఎలకు కూడా ఈ నెల11 వరకు హైదరాబాద్ లో రక్షణ కల్పిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొద్ది రోజుల్లో కూలి పోతుందని బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ అప్రజాస్వామిక మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. అలాంటి వారికి ఈ రెండు రాష్ట్రాలు గొడ్డలి పెట్టు అని అన్నారు. కెటిఆర్, హరీశ్ రావులు రేవంత్ రెడ్డి పై పరుష పదజాలంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిలా దిగజారి మాట్లాడలేరన్నారు. బాల్క సుమన్ స్థాయిని మరిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నాడని, సంస్కారం లేకుండా బిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News