Monday, December 23, 2024

బిజెపి అంటే బుద్ది జ్ఞానం లేని పార్టీ: జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

BJP is without intellectual

హైదరాబాద్: బిజెపి అంటే బుద్ది జ్ఞానం లేని పార్టీ గా మారిందని పియుసి చైర్మన్ ఎ జీవన్ రెడ్డి తెలిపారు. నిన్నటి ధర్నా తర్వాత బిజెపి నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతులు కడుపు మండి నిజామాబాద్ ఎంపి అరవింద్ ఇంటి ముందు వడ్లు కుప్పలు గా పోసి నిరసన చాటారని, ఏ ఉద్యమం అయినా ఆర్మూర్ నుంచి ప్రారంభం కావాల్సిందేనన్నారు. బిజెపి దొంగలపై రైతులు దంగల్ ప్రకటించారని, బండి సంజయ్ తిరుగు బోతు, అరవింద్ వాగు బోతు గా మారిపోయారని మండిపడ్డారు. బిజెపి ఎంపిలతో తెలంగాణ కు ఏమి ఒరగడం లేదని, గోధుమలు వడ్లకు తేడా తెలియని సన్నాసులు బిజెపి నేతలు అని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులు కదం తొక్కారు బిజెపి నేతల మదం దింపుతారని హెచ్చరించారు. ఎఫ్ సిఐ అంటే ఫ్రాడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గా మారిపోయిందని, కేంద్రం ఎఫ్ సిఐని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని, ప్రత్యర్థుల్ని వేధించే జాబితాలో కేంద్రం సిబిఐ, ఇడి, ఐటిలతో పాటు ఎఫ్ సిఐని చేర్చిందన్నారు. సిఎం కెసిఆర్ పెట్టిన డెడ్ లైన్ ను పాటించి కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని, గుజరాత్ లో కరెంటు కోతలు ఉంటే తెలంగాణ లో వరికోతలు మొదలయ్యాయన్నారు. పీయూష్ గోయల్ కు తగిన బుద్ధి చెబుతామని ఆహాన్ని దించుతామన్నారు. రైతుల కోసం 24 గంటలు తపించే వ్యక్తి సిఎం కెసిఆర్ అని, బిజెపిని బొంద పెట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, ఎంపి అరవింద్ రైతుల ఉద్యమంలో ఎందుకు పాల్గొనడం లేదని, బాండ్ పేపర్ లో రాసిచ్చింది ఏమైందని ప్రశ్నించారు. బిజెపి నేతలు ఇకనైనా బుద్ది జ్ఞానం తెచ్చుకుని ప్రవర్తించాలని జీవన్ రెడ్డి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News