Wednesday, January 22, 2025

బిజెపి కశ్మీర్ విధానం ఘోర వైఫల్యం : సిపిఐ ఎంపి విమర్శ

- Advertisement -
- Advertisement -

BJP Kashmir policy is failed says CPI

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో బ్యాంకు ఉద్యోగి ఉగ్రవాదుల మారణకాండకు బలైపోయిన నేపథ్యంలో సిపిఐ ఎంపి బినోయ్ విశ్వం బిజెపి పాలనా విధానాన్ని ప్రశ్నించారు. ఇది పూర్తిగా ఘోరంగా విఫలమైందని, దాని కోసం చెత్తబుట్ట ఎదురు చూస్తోందని వ్యాఖ్యానించారు. మే 1 నుంచి ఇప్పటివరకు ఉగ్రవాదుల హత్యాకాండ సంఘటనలు వరసగా ఎనిమిది జరిగాయి. కశ్మీర్ లోయలో మృత్యుక్రీడ యధేశ్చగా సాగుతోంది. ఈ రోజు కూడా ఒక ప్రాణం బలిగొంది. శాంతిని పునరుద్ధరిస్తామన్న హామీ ఏమైంది ? ఈ ఉగ్రహింసకు అంతం లేదా ? కొత్త జీవితాల వెలుగు ఎప్పుడు ఉదయిస్తుంది ? కశ్మీర్ స్వాతంత్య్ర పోరాట వీరుల వెనుక ఎవరు ఉన్నారు ? అమిత్‌షా తప్పనిసరిగా వీటిని వివరించాలి అని ఆయన ట్వీట్ చేశారు. గురువారం ఉగ్రకాండకు బలైన బ్యాంకు ఉద్యోగి కుమార్ రాజస్థాన్ లోని హనుమాన్‌గఢ్‌కు చెందిన వారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News