- Advertisement -
కూకట్‌పల్లి : బిజెపి ఆధ్వర్యంలో ఈ నెల 15 గురువారం సాయంత్రం ఖమ్మంలో తలపెట్టిన భారీ భహిరంగ సభను విజయవంతం చేయాలని కూకట్‌పల్లికి చెందిన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అర్శనపల్లి (అద్వాని) సూర్యారావు తెలిపారు. మంగళవారం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాలలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవ్వడంతో పాటుగా కుటుంబ పాలనకు తెరతీసి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన బిఆర్‌ఎస్ ని గద్దెదించే సమయం ఆసన్నమైయిందన్నారు.
ఈ సందర్భంగా బిజెపి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా ఇతర కేంధ్ర, రాష్ట్ర పార్టీ శ్రేణులు సభకు హాజరై దిశానిర్ధేశం చేస్తారన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంకు చెందిన బిజెపి శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున సభకు హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సూర్యారావు తెలిపారు.
- Advertisement -