Wednesday, January 22, 2025

అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలి : కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో అర్హులైన దళితులందరికి దళిత బంధు ఇచ్చే వరకు పోరాటం ఉదృతం చేయాలని ఎస్‌సి మోర్చా నాయకులను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. బుధవారం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఎస్‌సిమోర్చా రాష్ట్ర పధాదికారులు, జిల్లా బాధ్యులతో మోర్చా అధ్యక్షులు కొప్పు భాష అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న

శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజా సమస్యలపై మరింత పోరాటం చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంధుతో పాటు పలు పథకాల అమలులో జరుగుతున్నజాప్యంపై నిర్విరామ పోరాటాలు చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్‌సి మోర్చా రాష్ట్ర ప్రభారీ గంగిడి మనోహర్ రెడ్డి,జాతీయ ఎస్‌సి మోర్చా కార్యవర్గ సభ్యులు వేముల అశోక్, శ్రీ రాములు, రాష్ట్ర పదాదికారులు, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News