Tuesday, January 21, 2025

ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర సర్కారుకు సోయి లేదు : కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నీతి ఆయోగ్ మీటింగ్‌కు ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లరు? దేశ్ కీ నేత అనుకున్నప్పుడు.. దేశ ఆర్థిక పరిస్థితిపై సమావేశం ఉంటే ఎందుకుపోరు అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ- రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద బిఆర్‌ఎస్ సర్కారుకు సోయి లేదన్నారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ 8వ సమావేశానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఆర్థిక నిపుణులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల హాజరు అవుతుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లడం లేదన్నారు.రైతులకు 50 వేల కోట్ల రుణ మాఫీ చేయాల్సి ఉన్నది. జీతాలు టైంకు ఇచ్చే పరిస్థితి లేదు.

అప్పులకు వడ్డీ కట్టుడు అయిపోయింది.. ఇప్పుడు అసలు కట్టాల్సి వస్తున్నది.- అయినా ఈ సర్కారుకు సోయిలేదన్నారు. అడ్డగోలు అప్పులు చేసి అవతలపడితే.. తర్వాత తెలంగాణ ప్రజలు, మేము ఇబ్బంది పడాల్సి వస్తుదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారమే.. బడ్జెటేతర లెక్కలు కలపుకుంటే 6 లక్షల కోట్లు తెలంగాణ అప్పు ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో భూముల మీద 30 వేల ఎకరాలను అమ్మకానికి సిద్ధం పెట్టిందన్నారు. 111 జీవో ఎత్తేస్తే.. హైదరాబాద్ భవిష్యత్ ఎట్ల? అని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలం ఇవ్వడానికి జాగ దొరకడం లేదా అని ప్రశ్నించారు.- గ్రీన్ సిటీ పాలసీకి తూట్లు పొడ్చారు. జీవ వైవిధ్యానికి హాని కలిగిస్తున్నారని ఆరోపించారు. సెంగోల్ విషయంలో రాద్ధాంతం అవసరం లేదు. ఇది చర్చనీయాంశం కానే కాదన్నారు. దేశ ప్రజల సమస్యలపై పనిచేయాల్సిన ప్రతిపక్ష పార్టీలు అనవసర విషయాలను సమస్యగా సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News