Monday, December 23, 2024

కాంగ్రెస్‌కు ప్రజల నుంచి అప్పుడే వ్యతిరేకత

- Advertisement -
- Advertisement -

నారాయణపేట : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అప్పుడే వ్యతిరేకత మొ దలైందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా నా రాయణపేటలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. ఎన్నికల ముందు ఇ చ్చిన హామీ లు అమలుపరచలేక అయోమయానికి గురిచేసిందన్నా రు. సోనియా గాంధీ ఫ్యామిలీకి సూ ట్‌కేసులు ఎలా మో యాలన్న ఆలోచన తప్ప హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టి లేదని ఎద్దేవా చే శారు. ఆరు గ్యారంటీలను ఎప్పుడు అమలులోకి తీసుకొస్తౌరో కాంగ్రెస్ నేతలు చెప్పాలని, ఎన్ని లక్షల కోట్లు అవసరమో ఎలా సమకూర్చుకుంటా రో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఆర్‌టిసిలో మహిళలకు ఉచి త ప్రయాణం ద్వారా ప్రజల జీవితా ల్లో వెలుగులు రావని, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 ఎప్పుడు నుంచి ఇస్తారని ప్ర శ్నించారు.

దేశంలో ముచ్ఛటగా మూడవసారి బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని, మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని, అందుకు దేశ ప్రజలంతా ఆయనవై పు చూస్తున్నారని అన్నారు. పార్లమెం ట్ ఎన్నికల్లో తెలంగాణంలో 17 ఎం పి సీట్లలో గెలవడానికి పోటీ చేస్తున్నామన్నారు. బిఆర్‌ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అ జెండా లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలో కూడా తమ పార్టీకి అత్యధికం గా ఎంపి సీట్లు రానున్నాయని అన్నా రు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండూ కు టుంబ పార్టీలేనని, ఆ పార్టీలను న మ్మవద్దని పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లాలో ధన్వాడ, మరికల్ ప్రాంతాల్లో విజయ సంకల్ప యాత్ర లో సైతం కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, మాజీ ఎంపి ఎపి జితేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శాంత కుమార్, నాగురావు నామా జీ, రతంగా పాండురంగారెడ్డి, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News