Saturday, December 21, 2024

ఎన్నికల కోసమే కొత్త పథకాలు : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త పథకాలు ప్రకటిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తూ.. నకిరేకల్ పట్టణంలో ఆగి సర్దార్ పాపన్న చిత్ర పటానికి పూలమాల వేసి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తోందని మండిపడ్డారు. గ్రామకంఠం భూములతో సహా దళితులకు ఇచ్చిన భూముల్ని బిఆర్‌ఎస్ నేతలు ఆక్రమించారని ఆరోపణలు చేశారు. లిక్కర్ షాపులను మూడు నెలల ముందే వేలం వేస్తున్నారన్నారు. ప్రతీ గ్రామంలో నిత్యం బెల్టు షాపులు అందుబాటులో ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం ప్రజల పోరాటం మరవలేనిదని కొనియాడారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పాలన చూశారని.. ఈసారి బిజెపికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ‘రైతు రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసింది. సకాలంలో రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు డిఫాల్టర్లుగా మారారు. వరదలతో రైతులు నష్టపోయినా.. పరిహారం ఇవ్వలేదు. దళితబంధును.. బిఆర్‌ఎస్ నాయకుల బంధుగా మార్చారు. మద్యం టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుతో ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారు‘ అని కిషన్ రెడ్డి ఆరోపించారు.
* ఇటీవల ఖమ్మం జిల్లాలో సంఘ విద్రోహుల చేతిలో దారుణ హత్యకు గురైన యువమోర్చా 3టౌన్ అధ్యక్షుడు కొప్పుల సాయి కుటుంబాన్ని కిషన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థికసాయం అందజేసిన కేంద్రమంత్రి వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News