Wednesday, January 22, 2025

రేపు ఖమ్మంలో కిషన్ రెడ్డి పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈ నెల 27న ఖమ్మంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా నేడు సన్మాహక సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మంలో పర్యటించున్నారు. ఈ నెల 27న అమిత్ షా ఖమ్మం పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కిషన్ రెడ్డికి స్వాగతం పలికి, బైక్ ర్యాలీగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు తీసు కురావాలని బిజెపి జిల్లా కమిటీ నిర్ణయించింది. మధ్యాహ్నం వివిసి ఫంక్షన్ హాల్లో కార్యకర్తలు, ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి సన్నాహక సమావేశం జరపనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News