Monday, December 23, 2024

303 పైచిలుకు ఎంపి స్థానాలు మావే : డాక్టర్ కె.లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 303 పై చిలుకు స్థానాల్లో బిజెపి విజయం సాధిస్తుందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లా డుతూ.. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమేనన్నారు.

బిఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్క గూటి పక్షులేనని చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బిఆర్‌ఎస్ అసలు రంగు బయటప డుతుందన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేస్తానని కెసిఆర్ హామీ ఇచ్చి.. ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. దళిత బంధు పథకంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని స్వయంగా సిఎం ప్రకటించారని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News