Monday, December 23, 2024

అన్ని స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తాం : లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని శాసనసభ స్థానాల్లో బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తుందని బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపి డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు బిజెపినే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. బిఆర్‌ఎస్ ఎలాంటి యాత్రలు చేసినా ప్రజలే నమ్మబోరన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బిఆర్‌ఎస్ కు వేసినట్లేనని చెప్పారు. ఈ నెల 23న అధికార పార్టీ ఎమ్మెల్యేల ఘెరావ్, 24న రాష్ట్ర మంత్రుల ఘెరావ్, 27న జిల్లా కలెక్టర్ కార్యాలయ ముట్టడి, జైల్ భరో కార్యక్రమాలు చేపడుతామన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్ మిలియన్ మార్చ్ తరహా ఉద్యమాన్ని చేపడుతామని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News