Friday, December 20, 2024

సనాతన వ్యాఖ్యలపై స్పందనలేదేమి ?

- Advertisement -
- Advertisement -

రాహుల్, థాకరేలకు కేంద్ర మంత్రి ప్రశ్న
న్యూఢిల్లీ : భారతీయుల విశ్వాసపాత్రమైన సనాతన ధర్మాన్ని కొందరు పనిగట్టుకుని కించపరుస్తున్నారని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. ఇంతజరుగుతోన్నా ఇంతవరకూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కానీ, శివసేన నాయకులు ఉద్ధవ్ థాకరే కానీ దీనిపై మౌనం వహించారని తెలిపారు. విదేశీపర్యటనకు వెళ్లిన రాహుల్ పలు విషయాలపై పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

హిందూ , హిందూ ధర్మం , ఉపనిషిత్తులలో వీటి గురించి చెప్పడం కాదు, సనాతన ధర్మం పట్ల అవమానకర వ్యాఖ్యలపై రాహుల్ ఏమంటారని ప్రశ్నించారు. ప్రతిపక్షం ముందు దీనిపై తమ మౌనం వీడాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలు పనిగట్టుకుని సనాతన ధర్మం గురించి అవహేళనకు దిగుతున్నారని, ఇదే వారి తంతుగా మారిందని కేంద్ర మంత్రి తెలిపారు. విపక్ష నేతలు ఒకరి తరువాత ఒకరుగా దుష్ప్రచారానికి దిగడం ఆనవాయితీ అయిందన్నారు. దేశంలో ఇప్పుడు ఇండియా వర్సెస్ భారత్ వివాదం రగులుకుందని లండన్, పారిస్‌లలో రాహుల్ గాంధీ మాట్లాడటం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. కొందరు పనిగట్టుకుని కొన్నివిషయాలపై భయాందోళనలు , గందరగోళం సృష్టించాలనే ఆలోచన ఉంటుందని , వీరు జీవితాంతం ఇదే పనిలో ఉంటారు. భ్రమలు కల్పిస్తారని చెప్పారు.

అధికారం కోసం దిగజారిన ఉద్ధవ్: మంత్రి
గోద్రా తరహా ఘటన అంటూ అనుచిత వ్యాఖ్యలు

వచ్చే ఏడాది అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం తరువాత గోద్రా తరహా ఘటన జరుగుతుందని శివసేన నేత ఉద్ధవ్ థాకరే చెప్పడం అనుచితం అని కేంద్ర మంత్రి విమర్శించారు. కొందరు అధికార దాహంతో తమ సిద్ధాంతాలను విస్మరిస్తున్నారు. ఏదో విధంగా అధికారం పొందాలనే తపన కన్పిస్తోందన్నారు. ఇప్పుడు ఉద్ధవ్ మాటలకు ఆయన తండ్రి బాలాసాహెబ్ థాకరే బతికి ఉంటే ఏ విధంగా స్పందించే వాడో అని తెలిపారు. సనాతన ధర్మం గురించి పలు మాటలు దొర్లుతున్నా రాహుల్ కానీ ఉద్ధవ్ కానీ కిమ్మకుండా ఉన్నారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News