Thursday, November 21, 2024

పెట్టుబడి అంటూ ఎన్నారైకి 5 కోట్ల టోకరా.. బిజెపి నేత అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి అంటూ ఎన్నారై దగ్గర 5 కోట్లు తీసుకొని టోకరా వేసి మోసం చేసి కిడ్నాప్ డ్రామా ఆడిన కూకట్ పల్లికి బిజెపి నేతను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. యూసుఫ్‌గూడకు చెందిన ఆర్‌ రమేష్‌కుమార్‌, ఎన్‌ఆర్‌ఐ అయిన అతని సోదరుడు విజయ్‌కుమార్‌ను వడ్డేపల్లి లలిత్ శరణ్‌కుమార్ అలియాస్ వీఎల్ శరణ్‌కుమార్, మరికొందరు 2022 అక్టోబర్‌లో కలిశారు. తమ కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టి భారీ లాభాలు పొందుతుందని నమ్మించారు. విదేశాల్లో ఐటీ కంపెనీల ప్రతినిధిగా ఉన్న బాధితుడు, అతని సోదరుడు వారి మాటలు నమ్మారు.

దీంతో మొదటి దశలో 5 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ డబ్బును నిందితుడు శరణ్ కుమార్, అతని వ్యాపార భాగస్వాములు ఉపయోగించారు. ఎన్నారై సోదరులకు రూ.6.1 కోట్ల నష్టం వాటిల్లడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శరణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శరణ్ కుమార్ బీజేపీ నేత అని పోలీసులు తెలిపారు. నిందితుడిని సీసీఎస్ పోలీసులు విచారణకు పిలిపించగా.. అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అక్కడ మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News