Thursday, December 26, 2024

చీటింగ్ కేసులో బిజెపి నేత అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మెడికల్ సీట్ ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి దగ్గర లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిన ఘటనలో జనగా జిల్లా బిజెపి నాయకుడిని సిసిఎస్ పోలీసులు మంగళవారం నాడు అ రెస్ట్ చేశారు. జనాగామకు చెందిన కొత్తపల్లి సతీష్ నగరంలోని ఉప్పల్ నివాసం ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఓ వ్యక్తి తన కుమార్తెకు మెడికల్ సీటు ఇప్పించాలంటూ సతీషను సంప్రదించాడు. అందుకు అంగీకరించిన ఆయన బాచుపల్లిలోని మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ సీటు ఇప్పిస్తానని బాధితుడి వద్ద నుండి రూ. 48.53లక్షలు తీసుకున్నాడు. అయి తే ఎంతకు సీటు ఇప్పించక పోవడంతో బాధితుడు తన డబ్బును తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయడంతో కొద్ది రోజుల క్రితం రెండు బ్యాంక్ చెక్కులను ఇచ్చినా అవి బౌన్స్ అయ్యాయి. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితుడు కె. సతీష్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఇదిలావుండగా సతీష్ కుమార్ గత సాధారణ ఎన్నికలలో బిఎస్‌పి టికెట్‌పై జనగాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం నిందితుడు సతీష్ బిజెపి నేతగా కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News